పూల్‌లో సెగ‌లు రేపుతున్న ఫ‌రియా.. బికినీలో హ‌ద్దులు దాటి బోల్డ్ షో.. అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోయిన చిట్టి.. వీడియో వైరల్

జాతి రత్నాలు సినిమాలో చిట్టిగా ఫ్యాన్స్ మనసు దోచుకున్న ఫరియా అబ్దుల్లా అందాల ఆరబోతలో హద్దులు దాటేసింది. బికినీలో స్విమ్మింగ్ పూల్ లో బోల్డ్ షోకు దిగింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 

Published on: Nov 1, 2025, 14:43:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ హీరోయిన్, పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా హద్దులు దాటేసింది. అందాల ఆరబోతకు తెరతీసింది. బోల్డ్ షోతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. బికినీలో స్విమ్మింగ్ పూల్ లో ఫరియా ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. చిట్టి ఇలా చెలరేగిపోయిందేంటీ? అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఫరియా అబ్దుల్లా (instagram-Faria Abdullah)
ఫరియా అబ్దుల్లా (instagram-Faria Abdullah)

ఫరియా బోల్డ్ షో

స్విమ్మింగ్ పూల్ లో సెగలు రేపేలా బికినీలో అందాల ప్రదర్శనకు తెరతీసింది ఫరియా అబ్దుల్లా. ఈ హాట్ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ పిక్స్ తెగ వైరల్ గా మారాయి. ఇప్పటికే ఈ పోస్టును లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఫరియా ఎంతో హాట్ గా కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో

ఇక ఫొటోలు కాకుండా బీటీఎస్ వీడియోనూ ఫరియా పోస్టు చేసింది. ఈ వీడియో వెంటనే వైరల్ గా మారింది. చిట్టి అందాలను చూస్తూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్విమ్ సూట్ లో ఫరియా సోయగాలు చూసి తట్టుకోలేకపోతున్నారు.

‘‘ఈ షూట్ కు దక్కిన ప్రేమకు సంబంధించిన బీటీఎస్. నన్నెంతో కంఫర్ట్ గా ఉంచే టీమ్ కోసం ఓ సారి అరుస్తా. ఈ అమేజింగ్ లుక్ వచ్చేలా టీమ్ పాజిటివ్ వైబ్ ఇచ్చింది. మీ చుట్టూ ఉండే వాళ్ల వల్ల షూట్స్ చాలా ఫన్ గా ఉంటాయి’’ అని ఫరియా రాసుకొచ్చింది.

చిట్టి క్యారెక్టర్ తో

హైదరాబాద్ లో పుట్టిన ఫరియా అబ్దుల్లా జాతి రత్నాలు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు, మత్తు వదలరా 2 సినిమాల్లో నటించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు, కల్కి 2898 ఏడీ చిత్రాల్లో క్యామియోలో మెరిసింది.

ఇప్పుడు అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలోనూ ఫరియా హీరోయిన్ గా నటిస్తోంది. ఫరియా కేవలం నటి మాత్రమే కాదు మంచి ర్యాపర్ కూడా. మత్తు వదలరా 2 మూవీ ప్రమోషన్స్ కోసం ఆమె పాడిన ర్యాపర్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. నక్షత్ర, ఓ హిందీ వెబ్ సిరీస్ లోనూ ఫరియా నటించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More