తెలుసు కదా మూవీ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిల డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ చిత్రం తెలుసు కదా. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అయిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఇవాళ (అక్టోబర్ 17) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి తెలుసు కదా రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Oct 17, 2025, 15:24:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: తెలుసు కదా

తెలుసు కదా మూవీ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిల డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
తెలుసు కదా మూవీ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిల డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష, రవి మరియా తదితరులు

కథ, దర్శకత్వం: నీరజ కోన

సంగీతం: ఎస్ తమన్

సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ వీఎస్

ఎడిటింగ్: నవీన్ నూలి

నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్

రిలీజ్ డేట్: అక్టోబర్ 17, 2025

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం తెలుసు కదా. సిద్ధుకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి యాక్ట్ చేశారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అయిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.

ఎస్ తమన్ సంగీతం అందించిన తెలుసు కదా మూవీ ఇవాళ (అక్టోబర్ 17) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి తెలుసు కదా రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

అనాథ అయిన వరుణ్ కుమార్ (సిద్ధు జొన్నలగడ్డ) ఓ స్టార్ హోటల్‌లో చీఫ్ చెఫ్‌గా పనిచేస్తుంటాడు. అనాథ కావడంతో భార్యా, పిల్లలు, తనకంటూ ఓ కుటుంబం ఉండాలని కోరుకుంటాడు. కానీ, కాలేజ్‌ డేస్‌లో ప్రేమించిన రాగా (శ్రీనిధి శెట్టి)తో వరుణ్‌కు బ్రేకప్ అవుతుంది. కట్ చేస్తే మాట్రిమొనీ ద్వారా అంజలి (రాశి ఖన్నా)ని వరుణ్‌ పెళ్లి చేసుకుంటాడు.

కానీ, అంజలికి పిల్లలు పుట్టరు. దీంతో ఇద్దరు బాధపడుతుంటారు. ఈ సమయంలో వరుణ్, అంజలికి డాక్టర్ రాగా తారసపడుతుంది. తాను సరోగసీ ద్వారా బిడ్డను జన్మించేందుకు ఒప్పుకుంటుంది. దాంతో ముగ్గురు కలిసే ఉంటారు.

తెలుసు కదా ట్విస్టులు

ఆ తర్వాత ఏమైంది? ముగ్గురు జీవితాల్లో ఏర్పడిన పరిస్థితులు ఏంటీ? అసలు రాగాతో వరుణ్‌కు బ్రేకప్ ఎందుకు అయింది?. వరుణ్, రాగాల గురించి అంజలి ఏం తెలుసుకుంది? వరుణ్ విచిత్ర ప్రవర్తనకు కారణం ఏంటీ? ఎక్స్ లవర్, భార్యల మధ్య వరుణ్‌కు ఎదురైన సమస్యలు ఏంటీ? వరుణ్ కోరుకున్నట్లుగా తండ్రి అయ్యాడా? కుటుంబం లభించిందా? అనేది తెలియాలంటే తెలుసు కదా చూడాల్సిందే.

విశ్లేషణ:

రొమాన్స్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమాలు తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా చాలానే వచ్చాయి. తెలుసు కదా కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సంబంధించినదే. కానీ, ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాత్రం తెలుగులో రాలేదని చెప్పాలి.

ప్రేమ కోసం ట్రయాంగిల్ యాంగిల్ ఉండటం సాధారణమే కానీ, ఇక్కడ పిల్లల కోసం ట్రయాంగిల్ డ్రామా సాగడం చాలా యూనిక్ పాయింట్. కథ విషయంలో డైరెక్టర్ నీరజ కోన చాలా సక్సెస్ అయ్యారు. అయితే, టేకింగ్‌లో కాస్తా తడబడ్డారు. ప్రేమ అనే టాపిక్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నంతగా పిల్లల విషయం కాస్తా డ్రామాగా మారుతుంది.

కథకు తగినట్లుగా

అది కథకు తగినట్లుగానే తెరకెక్కించారు దర్శకురాలు నీరజ కోన. కానీ, చాలా వరకు ఆడియెన్స్ దానిని కథ నెమ్మదించినట్లుగా భావిస్తారు. పూర్తి ఎంగేజింగ్‌గా అనిపించదు. సిద్ధు క్యారెక్టరైజేషన్‌ను చాలా బాగా చూపించారు. ఎమోషన్స్, కోపం, ఫ్రస్టేషన్ అని బాగా ఆకట్టుకుంటాయి. కథ దాదాపుగా అర్థమైపోతుంది కాబట్టి పెద్దగా ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఏముండవు.

పిల్లలు కావాలనుకునే భార్యాభర్తలు, సరోగసీ ద్వారా బిడ్డను అందించడానికి మాజీ లవర్ రావడం, ఆ తర్వాత ముగ్గురు మధ్య చోటుచేసుకునే పరిస్థితులు ఒక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇంతకుమించి ఏం చెప్పిన సినిమా స్పాయలర్ అవుతుంది. క్లైమాక్స్ ఓకే బాగానే ఉంది.

నటీనటుల యాక్టింగ్

సిద్ధు జొన్నలగడ్డ తన పాత్రలో అదరగొట్టాడు. రాశి, శ్రీనిధితో కెమిస్ట్రీ బాగుంది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వైవా హర్షతో వచ్చే కామెడీ సీన్స్ నవ్విస్తాయి.

తమన్ సంగీతం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగుంది. డైరెక్టర్ టేకింగ్ ఓకే. ఫైనల్‌గా చెప్పాలంటే యూనిక్ పాయింట్‌తో వచ్చిన డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెలుసు కదా.

రేటింగ్: 3/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More