కాంత ట్రైలర్-స్టార్‌డమ్ కోసం ఎంతకైనా తెగించే హీరోగా దుల్కర్ సల్మాన్-పోలీస్‌గా రానా- బ్లాక్‌బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్

దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న అప్ కమింగ్ మూవీ ‘కాంత’. ఈ సినిమాలో రానా దగ్గుబాటి కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇవాళ రిలీజైన ఈ చిత్రం ట్రైలర్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. 

Published on: Nov 06, 2025 1:02 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరో క్రేజీ ప్రాజెక్ట్ తో హిట్ కొట్టేందుకు వచ్చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. అతను హీరోగా యాక్ట్ చేస్తున్న ‘కాంత’ సినిమా ట్రైలర్ ఇవాళ (నవంబర్ 6) రిలీజైంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి తదితరులు నటిస్తున్నారు.

కాంత సినిమాలో దుల్కర్ సల్మాన్
కాంత సినిమాలో దుల్కర్ సల్మాన్

కాంత ట్రైలర్ రిలీజ్

1950ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమ, షూటింగ్ నేపథ్యంలో కాంత మూవీ సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. వేఫేరర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా పతాకాలపై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించిన ఈ పీరియాడిక్ డ్రామా థ్రిల్లర్ చిత్రం 1950ల నాటి మద్రాస్ నేపథ్యంలో సాగుతుంది. కాంత ట్రైలర్‌ను తమిళం, తెలుగు భాషల్లో ట్విట్టర్‌లో షేర్ చేశాడు దుల్కర్.

గురుశిష్యుల పోరు

కాంత ట్రైలర్ 'కింగ్ ఆఫ్ యాక్టింగ్' చంద్రన్ (సల్మాన్), అతన్ని స్టార్‌ను చేసిన దర్శకుడు (సముద్రఖని) మధ్య అహాన్ని చూపిస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో సినిమా థ్రిల్లర్‌గా మారుతుంది. ప్రతిదీ తన దారిలోనే జరిగేలా చూసుకోవడానికి చంద్రన్ వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ మూవీలో రానా దగ్గుబాటి పోలీస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. అతను ఏ విషయంలోనో ఎంక్వైరీ కొనసాగిస్తాడు.

కాంత గురించి..

ఒక ప్రముఖ తమిళ దర్శకుడు అయ్య, సినీ నటుడు చంద్రన్ మధ్య ఉన్న ఉద్రిక్త సంబంధాన్ని 'కాంత' అన్వేషిస్తుంది. అయ్య తెరకెక్కించాలనుకున్న ఫీమేల్ లీడ్ రోల్ మూవీ 'శాంత' పేరును 'కాంత'గా మార్చాలని చంద్రన్ నిర్ణయించుకున్నప్పుడు గురుశిష్యుల మధ్య అహంకారపూరిత యుద్ధాన్ని సినిమా టీజర్ చూపించింది. ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రమవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ విషయాన్ని ట్రైలర్ ధృవీకరించింది.

పాటలు

జూలై 2023లో 'నీల' ఫేమ్ సెల్వమణి దర్శకత్వంలో ఒక సినిమా కోసం దుల్కర్, రానా చేతులు కలుపుతున్నట్లు ప్రకటించారు. గతంలో దుల్కర్ తొలి తెలుగు చిత్రం 'మహానటి' (2018)కి పనిచేసిన స్పానిష్ సినిమాటోగ్రాఫర్ డాని సాంచెజ్-లోపెజ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారు. జాను చంతర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'పనిమలరే', 'కణ్మణి నీ', 'రేజ్ ఆఫ్ కాంత' అనే పాటలు ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయ్యాయి.

కాంత రిలీజ్ డేట్

'కాంత' నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ తమిళ ఒరిజినల్ సినిమాను తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్ వెర్షన్లు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా విడుదల మొదట సెప్టెంబర్ 12న షెడ్యూల్ చేశారు. కానీ ఆగస్టు 28న విడుదలై విజయవంతంగా నడుస్తున్న 'లోకా: చాప్టర్ 1 – చంద్ర' కోసం వాయిదా వేశారు. దుల్కర్ నిర్మించిన ‘లోకా’ మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఫ్యాన్స్ రియాక్షన్

కాంత ట్రైలర్ చూసి దుల్కర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ సాగిపోతున్న దుల్కర్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారెంటీ అని పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాతో దుల్కర్ నట విశ్వరూపం చూడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News/Entertainment/కాంత ట్రైలర్-స్టార్‌డమ్ కోసం ఎంతకైనా తెగించే హీరోగా దుల్కర్ సల్మాన్-పోలీస్‌గా రానా- బ్లాక్‌బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్
News/Entertainment/కాంత ట్రైలర్-స్టార్‌డమ్ కోసం ఎంతకైనా తెగించే హీరోగా దుల్కర్ సల్మాన్-పోలీస్‌గా రానా- బ్లాక్‌బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్