దుల్కర్ సల్మాన్ పీరియడ్ హారర్ థ్రిల్లర్ కాంతా నుంచి ర్యాప్ ఆంథమ్ రిలీజ్.. అదిరిపోయిన మలయాళం స్టార్ యాక్షన్, సాంగ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కాంతా మూవీ నుంచి రేజ్ ఆఫ్ కాంతా వచ్చేసింది. ఈ ర్యాప్ ఆంథమ్ అదిరిపోయే మ్యూజిక్, ఈ స్టార్ హీరో యాక్షన్ తో ప్రేక్షకులను మెప్పిస్తోంది.
దుల్కార్ సల్మాన్ నటిస్తున్న మూవీ కాంతా (Kaantha). ఇప్పుడీ సినిమా నుంచి రేజ్ ఆఫ్ కాంతా అంటూ టైటిల్ ట్రాక్ రిలీజైంది. తమిళం, తెలుగు కలగలిపి వచ్చిన ఈ పాట ప్రేక్షకులను ఇన్‌స్టాంట్ గా ఆకట్టుకుంది. పాత్రను వర్ణిస్తూ సాగిపోయిన ఈ సాంగ్, మ్యూజిక్, దుల్కార్ సల్మాన్ యాక్షన్ మూవీపై అంచనాలను పెంచేస్తోంది.

రేజ్ ఆఫ్ కాంతా సాంగ్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కాంతా మూవీ నుంచి ఆంథమ్ సాంగ్ రేజ్ ఆఫ్ కాంతా గురువారం (అక్టోబర్ 30) రిలీజైంది. ర్యాప్ స్టైల్లో ఈ ఆంథమ్ సాగింది. అయితే ముఖ్యంగా తమిళం, తెలుగు లిరిక్స్ కలగలిపి ఈ పాట రావడం విశేషం. ఈ రెండు రాష్ట్రాల ప్రేక్షకుల సంస్కృతి, భాషలు, ఎమోషన్స్ అన్నీ ఈ పాటలో కనిపించాయి.
ఈ సాంగ్ రిలీజ్ కాగానే వెంటనే వైరల్ గా మారిపోయింది. నిజానికి సాంగ్ టీజరే ఎంతో ఆసక్తి రేపింది. ఈ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాటను జాను చంతర్ కంపోజ్ చేశాడు. ఈ పాట 4 నిమిషాల 46 సెకన్ల పాటు సాగింది.
కాంతా మూవీ గురించి..
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఈ కాంతా మూవీ ఓ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోంది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని కూడా నటిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రానా దగ్గుబాటి, దుల్కార్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ల కింద సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా 1950ల మద్రాస్ నగర పరిస్థితుల నేపథ్యంలో సాగుతుంది. అప్పట్లో పాపులర్ అయిన ఓ తమిళ డైరెక్టర్.. తాను పెద్ద స్టార్ ను చేసిన ఓ హీరోతో అతని సంబంధాలు దెబ్బ తినడం.. ఇద్దరి ఇగోల చుట్టూ సాగే కథ ఇది. ఈ మూవీ తమిళ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది. దుల్కర్ లీడ్ రోల్ కావడంతో ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


