మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ.. థియేటర్లలో ఈ సినిమా బ్రేక్ చేసిన రికార్డులు ఇవే

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లోనే ఓ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ రాబోతోంది. అయితే అంతకంటే ముందు థియేటర్లలో ఈ సినిమా బ్రేక్ చేసిన రికార్డుల గురించి తెలుసుకోండి. కల్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ మూవీ చాలా రికార్డులే క్రియేట్ చేసింది.

Published on: Oct 30, 2025, 17:51:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈవారం ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి మలయాళం సూపర్ హీరో మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి శుక్రవారం (అక్టోబర్ 31) రాబోతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ బ్రేక్ చేసిన రికార్డులేవో చూడండి.

మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ.. థియేటర్లలో ఈ సినిమా బ్రేక్ చేసిన రికార్డులు ఇవే
మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ.. థియేటర్లలో ఈ సినిమా బ్రేక్ చేసిన రికార్డులు ఇవే

లోకా ఛాప్టర్ 1 బ్రేక్ చేసిన రికార్డులు ఇవే

కల్యాణి ప్రియదర్శన్ నటించిన మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర. ఈ సినిమా ఏడు భాషల్లో శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు ఇలా ఉన్నాయి.

అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీ

'లోకా ఛాప్టర్ 1: చంద్ర' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మూవీ మోహన్‌లాల్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ 'ఎల్2: ఎంపురాన్' సినిమా లైఫ్‌టైమ్ కలెక్షన్లను (రూ. 266.81 కోట్లు) అధిగమించి.. మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా అవతరించింది.

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'లూసిఫర్' సీక్వెల్ 'ఎల్2: ఎంపురాన్' ఇప్పుడు రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 2024 బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'మంజుమ్మెల్ బాయ్స్' (రూ. 241.03 కోట్లు) నిలిచింది. అయితే స్టార్ హీరోలతో నిండిన 'ఎంపురాన్'తో పోలిస్తే, 'లోకా'కు తొలి రోజున అంత హైప్ లేదు. అందుకే ఓపెనింగ్ డే రికార్డును మాత్రం 'ఎంపురాన్'ను అధిగమించలేకపోయింది.

300 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మలయాళ మూవీ

'లోకా' మూవీ కేవలం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానే కాకుండా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ.303.57 కోట్లుగా నమోదయ్యాయి. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, టోవినో థామస్ వంటి స్టార్ హీరోలు అతిథి పాత్రల్లో మెరిశారు.

కేరళలో అత్యధిక వసూళ్ల మూవీ

కేవలం ప్రపంచవ్యాప్తంగానే కాదు కేరళ రాష్ట్రంలో కూడా 'లోకా' సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయంలో కల్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా.. గతంలో మోహన్‌లాల్ నటించిన 'తుడరుమ్' రికార్డును బద్దలు కొట్టింది. గతంలో కేరళలో రూ. 118 కోట్లు వసూలు చేసిన 'తుడరుమ్' రికార్డును 'లోకా' అధిగమించింది.

'పాన్-ఇండియన్' బ్లాక్‌బస్టర్‌గా గుర్తింపు

ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన 'లోకా' మూవీ.. కేరళతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా రూ. 100 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి మలయాళ చిత్రంగా నిలిచింది. ఈ మైలురాళ్లతో పాటు మిగతా ఇండియా కలెక్షన్ల నుంచి రూ. 50 కోట్లు ఆర్జించడంతో.. ట్రేడ్ ట్రాకర్లు ఈ సినిమాను 'పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్‌'గా ధ్రువీకరించారు. ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ రూ. 183.67 కోట్లు కాగా.. ఓవర్సీస్ కలెక్షన్ రూ. 119.9 కోట్లుగా ఉంది.

కల్యాణి ప్రియదర్శన్: మలయాళంలో సరికొత్త చరిత్ర

ఈ సినిమా విజయం కథానాయిక కల్యాణి ప్రియదర్శన్‌కు కూడా అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చింది. రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన ఓ సినిమాలో లీడ్ రోల్ పోషించిన మొట్టమొదటి మలయాళ నటిగా ఆమె చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా రూ. 300 కోట్ల క్లబ్‌లో ఉన్న ఏకైక మలయాళ యాక్టర్ కూడా ఆమెనే కావడం విశేషం. టాప్ లిస్ట్‌లో ఉన్న మిగతా సినిమాలు అన్నీ హీరో-సెంట్రిక్ కావడంతో.. 'లోకా' విజయం నిజంగా ప్రత్యేకమైనదిగా నిలిచింది.

లోకా మూవీ గురించి..

కల్యాణి ప్రియదర్శన్ తోపాటు నస్లెన్ కూడా నటించిన ఈ లోకా మూవీ.. ఒక అంతుచిక్కని మహిళ అయిన 'చంద్ర' కథను చెబుతుంది. ఆమె అవయవాల అక్రమ రవాణా చేసే ఒక రాకెట్‌లో చిక్కుకుంటుంది. అయితే కేరళలోని ఒక ప్రసిద్ధ జానపద కథను ఆధునిక దృక్పథంలో పునర్నిర్మించిన ఈ సినిమాలో.. చంద్రకు మానవాతీత శక్తులు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చంద్ర ఏం చేసింది అన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More