నెట్‌ఫ్లిక్స్‌లోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్.. విలన్‌గా వస్తున్న స్టార్ హీరోయిన్.. ట్రైలర్ రిలీజ్

నెట్‌ఫ్లిక్స్ లోకి మరో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయినే విలన్ గా నటిస్తుండటం విశేషం. తాజాగా మంగళవారం (నవంబర్ 4) రిలీజైన ట్రైలర్ సిరీస్ పై అంచనాలను పెంచేస్తోంది.

Published on: Nov 4, 2025, 15:17:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటి వరకూ వచ్చిన ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి ఢిల్లీ క్రైమ్ (Delhi Crime). ఇప్పటికే రెండు సీజన్లు పూర్తయ్యాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ ఇప్పుడు అలాంటిదే మరో కథతో మూడో సీజన్ ను తీసుకొస్తోంది. నవంబర్ 13 నుంచి ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్.. విలన్‌గా వస్తున్న స్టార్ హీరోయిన్.. ట్రైలర్ రిలీజ్
నెట్‌ఫ్లిక్స్‌లోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్.. విలన్‌గా వస్తున్న స్టార్ హీరోయిన్.. ట్రైలర్ రిలీజ్

ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 ట్రైలర్

ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది. మంగళవారం (నవంబర్ 4) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఢిల్లీ డీసీపీ వర్తికా చతుర్వేదిగా సీనియర్ నటి షెఫాలీ షా తిరిగి వస్తోంది. ఇక ఈ కొత్త సీజన్ లో బడీ దీదీ అనే విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి, మహారాణి వెబ్ సిరీస్ ఫేమ్ హుమా ఖురేషీ నటిస్తుండటం విశేషం.

ఈ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. అమ్మాయిల అక్రమ రవాణా చుట్టూ తిరిగే కథలా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఆ రాకెట్ ను బడీ దీదీ నడిపిస్తుంటుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ మూడో సీజన్ ను కూడా తెరకెక్కించారు. ఇందులో డీసీపీ వర్తికా చతుర్వేది, ఆమె టీమ్.. బడీ దీదీ విసిరిన సవాలును ఎలా స్వీకరించాన్నది చూడొచ్చు. ఈ కొత్త సీజన్ నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ గురించి..

ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019లో వచ్చింది. రిచీ మెహతా క్రియేట్ చేసి ఈ షోకి అతనితోపాటు తనూజ్ చోప్రా కూడా కలిసి డైరెక్ట్ చేశారు. మొత్తం రెండు సీజన్లలో 12 ఎపిసోడ్లు ఇప్పటికే వచ్చేశాయి. తొలి సీజన్ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, ఆ కేసు విచారణ సాగిన తీరు చుట్టూ తిరిగింది. ఇక రెండో సీజన్ లో కచ్చా బనియన్ గ్యాంగ్ ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఇంట్లోని ఒంటరి ముసలివాళ్లనే లక్ష్యంగా చేసుకొని వాళ్లు చేసే దాడులు, కేసు ఎలా పరిష్కారమైందన్నది చూపించారు.

ఇప్పుడు మూడో సీజన్ అమ్మాయిల అక్రమ రవాణా అనే అంశంపై రూపొందింది. గత రెండు సీజన్లు సాగిన తీరు ఈ మూడో సీజన్ పై అంచనాలు పెంచేశాయి. ఇందులో షెఫాలీ షాతోపాటు హుమా ఖురేషీ, రసికా దుగల్, రాజేష్ తైలాంగ్ లాంటి వాళ్లు నటించారు. ఢిల్లీ క్రైమ్ మూడో సీజన్ నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ ‌లో స్ట్రీమింగ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More