హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. మూవీ టైటిల్ ఇదే.. రక్తం నిండిన ముఖంతో.. హైప్ పెంచేలా టీజర్

డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా మారాడు. వైలెన్స్ తో కూడిన లవ్ స్టోరీగా ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈ మూవీ టైటిల్ టీజర్ ను ఇవాళ రిలీజ్ చేశారు మేకర్స్. 

Published on: Nov 01, 2025 8:02 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లోకేష్ కగనరాజ్.. ఈ పేరు వింటే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గుర్తుకొస్తాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ లాంటి సూపర్ హిట్లను అందించాడు లోకేష్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో సంచలనమే క్రియేట్ చేశాడు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు కెప్టెన్ సీట్ వదిలి రంగంలోకి దిగాడు. హీరోగా డెబ్యూ చేయబోతున్నాడు. అతను హీరోగా వస్తున్న సినిమా టైటిల్ ను ఇవాళ (నవంబర్ 1) రిలీజ్ చేశారు.

లోకేష్ కనగరాజ్ స్టిల్ (youtube)
లోకేష్ కనగరాజ్ స్టిల్ (youtube)

లోకేష్ కనగరాజ్ సినిమా

ఇప్పటివరకూ సాధారణంగా అయితే డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ మూవీ టైటిల్ ను రివీల్ చేసేవాడు. ఇప్పుడు హీరోగా అతని మూవీ టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫుల్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘డీసీ’ అనే పేరు పెట్టారు. అంటే ఇందులో హీరో క్యారెక్టర్ పేరు దేవదాస్. హీరోయిన్ క్యారెక్టర్ పేరు చంద్ర. ఈ రెండు పేర్లలోని ఇంగ్లీష్ మొదటి లెటర్స్ కలిపి డీసీ అని పేరు పెట్టారు.

అదిరిపోయిన టీజర్

లోకేష్ కనగరాజ్ హీరోగా తెరకెక్కుతున్న డీసీ మూవీ టైటిల్ రిలీజ్ టీజర్ అదిరిపోయింది. రక్తం నిండిన ముఖంతో అలా నడుస్తూ లోకేష్ కనగరాజ్ వస్తున్న విజువల్ అదిరిపోయింది. మరోవైపు బాధలో వామికా గబ్బి నడిచి వస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ వామికా గబ్బి. టీజర్ లో వీళ్లిద్దరూ ఒకరికొకరు కలుసుకోరు. చివర్లో అద్దంలో మాత్రమే హీరోను చూస్తుంది హీరోయిన్. ఎయింట్ నోబడీ అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్లో అదిరిపోయింది.

యాక్షన్ లవ్ స్టోరీ

డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ సినిమాల్లో యాక్షన్ మోతాదు ఎక్కువే. హీరో ఎలివేషన్లు ఎక్కువే. ఇప్పుడు హీరోగా కూడా అలాంటి స్టోరీతోనే డెబ్యూ చేస్తున్నాడు లోకేష్ కనగరాజ్. అరుణ్ మాథేశ్వరణ్ దర్శకత్వంలో రెడీ అవుతున్న డీసీ సినిమాలో యాక్షన్ కు పెద్ద పీట వేసినట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. ఇదో యాక్షన్ లవ్ స్టోరీగా కనిపిస్తోంది.

అనిరుధ్ మ్యూజిక్

లోకేష్ సినిమాలంటే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ ఉండాల్సిందే. అది డైరెక్టర్ గా లోకేష్ తీసిన సినిమాలైనా, హీరోగా వస్తున్న మూవీ అయినా. అందుకే డీసీ మూవీకి కూడా అనిరుధే మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు డీఓపీ ముకేష్. సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. 2026 సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.