రజనీకాంత్ కూలీ సినిమా ట్రైలర్ వచ్చేది ఆ రోజే.. అఫీషియల్ డేట్ చెప్పిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. మూవీ చూసి రజనీ హగ్
ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్ట్ లో రజనీకాంత్ మూవీ కూలీ ఉంది. ఈ ఫిల్మ్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ అప్ డేట్ల కోసం కూడా అంతే ఎగ్జయిట్ మెంట్ తో ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కు డైరెక్టర్ గుడ్ న్యూస్ చెప్పారు. ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ ‘కూలీ’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 14న ఈ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ కు మరో నెల రోజుల టైమ్ మాత్రమే ఉంది. అయినా ఇప్పటికీ మూవీ నుంచి ట్రైలర్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ ట్రైలర్ ఎప్పుడూ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. కూలీ మూవీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అదిరిపోయే న్యూస్ చెప్పారు.
కూలీ పోస్టర్ లో రజనీకాంత్ (x/sunpictures)
ట్రైలర్ అప్పుడే
కూలీ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూవీ గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. కూలీ ఫిల్మ్ ట్రైలర్ ను ఆగస్టు 2న రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. ‘‘మేం ఒక్క ట్రైలర్ ను మాత్రమే రిలీజ్ చేస్తాం. అది ఆగస్టు 2. నేను ఎక్కవ డేట్లు చెప్పాలనుకోవడం లేదు’’ అని ఆ ఇంటర్వ్యూలో యాంకర్ తో చెప్పారు లోకేష్.
రజనీ సార్ హ్యాపీ
కూలీ సినిమా చూసి రజనీ సార్ హ్యాపీగా ఫీలయ్యారని లోకేష్ కనగరాజ్ వెల్లడించారు. ‘‘డబ్బింగ్ స్టూడియోలో రజనీ సార్ పూర్తి సినిమా చూశారు. నన్ను హగ్ చేసుకున్నారు. ఎంతో ఆనందంగా కనిపించారు. ‘ఈ సినిమా దళపతిలా అనిపించింది’ అని చెప్పారు. రజనీ సార్ కోసం ఫాంటసీ స్టోరీ రాశా. కానీ అది మేకింగ్ కు ఎక్కువ టైమ్ పడుతుందని కూలీ మూవీ రెడీ చేశా. హార్బర్ బ్యాక్ డ్రాప్ లో స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే మూవీ ఇది. సెట్స్ లో రోజు 1000 మంది వరకూ పనిచేసేవాళ్లు’’ అని లోకేష్ చెప్పారు.
ఆ హీరోలతో
కూలీ పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ లో రజనీ సార్ ను చాలా మిస్సయ్యా అని లోకేష్ అన్నారు. ‘‘రజనీ సార్ ను చాలా మిస్ అయ్యా. నాలుగు నెలల పాటు తరచుగా కలవడానికి కుదరలేవు. టైమ్ దొరికితే జైలర్ 2 సెట్ కు వెళ్లి కలిసేవాణ్ని. చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలు చూస్తూ పెరిగా. ఆ హీరోలందరితో కలిసి సినిమాలు చేయాలని ఉంది’’ అని లోకేష్ కనగరాజ్ పేర్కొన్నారు.
కూలీ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ రిలీజైన రెండు పాటలు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ‘చికిటు’, ‘మోనికా’ పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.
News/Entertainment/రజనీకాంత్ కూలీ సినిమా ట్రైలర్ వచ్చేది ఆ రోజే.. అఫీషియల్ డేట్ చెప్పిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. మూవీ చూసి రజనీ హగ్
News/Entertainment/రజనీకాంత్ కూలీ సినిమా ట్రైలర్ వచ్చేది ఆ రోజే.. అఫీషియల్ డేట్ చెప్పిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. మూవీ చూసి రజనీ హగ్