ఈ ప్రపంచంలో అందమైనవి నేచర్, అమ్మాయిలు.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ.. పెళ్లైన జంట ప్రేమలో పడితే!
ఇవాళ ఓటీటీలోకి ఓ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ వచ్చేసింది. పెళ్లయిన జంట మళ్లీ ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఏ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందో ఇక్కడ చూసేయండి.
ఓటీటీలోకి ఎప్పటికప్పుడూ ఫ్రెష్ కంటెంట్ వస్తూనే ఉంటోంది. ఇక డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చి ఎంటర్ టైన్ చేసే సినిమాలు, సిరీస్ లు ఎన్నో. ఇప్పుడు ఆ కోవలోనే మరో మూవీ నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఆ సినిమా పేరు ‘రిధి’.

రిధి ఓటీటీ
రొమాంటిక్ లవ్ స్టోరీ రిధి ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇవాళ (అక్టోబర్ 26) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీలో ప్రతి సండే ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కథా సుధలో భాగంగా ఆ చిన్న సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఈ ఆదివారం ఈ వరుసలోనే రిధి డిజిటల్ ప్రేక్షకులకు లవ్ ను పంచేందుకు వచ్చేసింది.
ఈటీవీ విన్ కథాసుధ
ఈటీవీ విన్ ఓటీటీలో ప్రతి ఆదివారం కథా సుధలో భాగంగా ఓ చిన్న సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ రిధి రిలీజైంది. 4 టేల్స్ లో భాగంగా కథా సుధలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది ఈ షార్ట్ ఫిల్మ్. ఇందులో రావణ్ రెడ్డి, నిట్టూరె, చాందిని రావు తదితరులు నటించారు. దీనికి కిశోర్ గునాన డైరెక్టర్. కథాగ్ని పిక్చర్స్ పై కొత్తపల్లి సురేష్ ప్రొడ్యూస్ చేశాడు.
పెళ్లయ్యాక ప్రేమ
రిధి షార్ట్ ఫిల్మ్ ఆకట్టుకునేలా ఉంది. మనసుకు హత్తుకునేలా ఉంది. పెళ్లయిన జంటలకు ఇది బాగా కనెక్ట్ అవుతుంది. వివాహం తర్వాత చాలా మంది దంపతులు ప్రేమగా ఉండలేకపోతున్నారు. ఎడ మొహం, పెడ మొహంలా మారిపోతున్నారు. పెళ్లయిన తర్వాత ప్రేమగా ఎలా ఉండొచ్చు, లవ్ ఎంత ముఖ్యమనేది ఈ రిధి షార్ట్ ఫిల్మ్ లో చూపించారు.
రిధి ప్రేమలో కృష్ణ
కృష్ణ ఓ ఫొటోగ్రాఫర్. అతనికి రిధితో పెళ్లవుతుంది. కొన్నేళ్ల తర్వాత కూడా వీళ్లు ప్రేమగానే ఉంటారు. రిధి ప్రేమలో పడుతూనే ఉంటాడు కృష్ణ. ప్రతి రోజు కొత్తగా ప్రేమిస్తూనే ఉంటాడు. నిజమైన ప్రేమకు టైమ్ తో సంబంధం లేదని, అది ఛాయిస్ తోనే ముడిపడి ఉంటుందని ఈ స్టోరీ చాటుతుంది.
ఈ ప్రపంచంలో అందమైన రెండు ఏంటో తెలుసా? ఒకటి నేచర్, రెండోది అమ్మాయిలు.. అంటూ కృష్ణ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఈటీవీ విన్ ఓటీటీలోని రిధి మూవీ రోజులు గడుస్తున్నా కొద్దీ తగ్గిపోదు, ఇంకా బలంగా మారుతుందని చాటుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


