ఒకే అమ్మాయిని లవ్ చేసే నలుగురు కుర్రాళ్లు.. సడెన్‌గా కిడ్నాప్..ఓటీటీలోకి ప్రియదర్శి కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. ఎప్పుడంటే?
బలగం, కోర్ట్ లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి. ఇప్పుడు మిత్ర మండలి అంటూ థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. స్ట్రీమింగ్ ఎక్కడో చూసేయండి.
థియేటర్లలో నవ్వుల రైడ్ అంటూ సాగుతోంది ‘మిత్ర మండలి’. కానీ ఈ మూవీకి ఊహించిన టాక్ రాలేదు. నవ్వులు కూడా తక్కువే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలుసు కదా, కె ర్యాంప్, డ్యూడ్ వంటి సినిమాల కారణంగా మిత్ర మండలి పేరు ఎక్కువగా వినిపించడం లేదు. ప్రియదర్శి లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మిత్ర మండలి ఏ ఓటీటీలోకి వస్తుందో చూసేద్దాం.

మిత్ర మండలి ఓటీటీ
ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మిత్ర మండలి. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ మూవీలో ప్రియదర్శితో పాటు నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మమూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిశోర్, సత్య తదితరులు నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రానుంది.
ఓటీటీ రైట్స్
మిత్ర మండలి సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు సొంతం చేసుకుంది. ఈ రెండింటి వాల్యూ కలిపి రూ.9.50 కోట్లుగా టాక్. ఈ ప్రకారం మిత్ర మండలి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఓటీటీలో అడుగుపెట్టబోతుంది.
ఓటీటీ రిలీజ్
మిత్ర మండలి ఓటీటీ రిలీజ్ ఎప్పుడో చూద్దాం. సాధారణంగా తెలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మిత్ర మండలి నవంబర్ రెండో వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలున్నాయి. ఆ రకంగానే అమెజాన్ ప్రైమ్ వీడియోతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై ప్రైమ్ వీడియో త్వరలోనే ప్రకటన చేసే అవకాశముంది.
మిత్ర మండలి కథ
ఒక అమ్మాయి ప్రేమ కోసం నలుగురు కుర్రాళ్లు తిరిగే కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మిత్ర మండలి. చైతన్య (ప్రియదర్శి), సాత్విక్ (విష్ణు), రాజీవ్ (ప్రసాద్ బెహరా), అభి (రాగ్ మయూర్) ఫ్రెండ్స్. వీళ్లు జంగ్లీపట్నం అనే ఊర్లో ఉంటారు. అదే గ్రామంలో ఉండే స్వేచ్ఛ (నిహారిక ఎన్ఎమ్)ను ప్రేమిస్తుంటారు. ఆమె తండ్రి నారాయణ (వీటీవీ గణేష్)కు పులిబిడ్డ అని పేరు. అతనికి అందరూ భయపడుతుంటారు.
మరోవైపు చైైతన్యను స్వేచ్ఛ ప్రేమిస్తుంటుంది. ఈ క్రమంలోనే స్వేచ్ఛను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఈ కేసును సాల్వ్ చేసేందుకు పోలీస్ ఆఫీసర్ గా వెన్నెల కిశోర్ రంగంలోకి దిగుతాడు. మరి స్వేచ్ఛను కిడ్నాప్ చేసింది ఎవరు? చైతన్య, స్వేచ్ఛ లవ్ స్టోరీ ఏమైంది? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


