ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్-గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ప్రెగ్నెంట్- పాప కిడ్నాప్‌-అదిరే ట్విస్ట్‌- 8.2 రేటింగ్

ఓటీటీలోకి తమిళ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి అడుగుపెట్టనుంది. ఇందులో బిందు మాధవి కీ రోల్ ప్లే చేసింది. 

Published on: Oct 18, 2025, 17:58:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ థ్రిల్లర్ రాబోతుంది. అదిరే ట్విస్ట్ లతో సాగే ‘బ్లాక్ మెయిల్’ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన తమిళ థ్రిల్లర్ ఈ చిత్రం. ఇందులో బిందు మాధవి కీ రోల్ ప్లే చేసింది. జీవీ ప్రకాశ్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేశాడు. ఈ సినిమా ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి రాబోతుంది.

ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ (x)

బ్లాక్ మెయిల్ ఓటీటీ

తమిళ క్రైమ్ థ్రిల్లర్ బ్లాక్ మెయిల్ ఓటీటీలోకి ఎప్పుడు రాబోతుందో తెలిసింది. ఈ సూపర్ హిట్ మూవీ ఒకే రోజు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో, ఇండియా బయట సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి ఇది అందుబాటులో ఉండనుంది. అక్టోబర్ 30 నుంచి ఈ సినిమాను ఓటీటీలో చూడొచ్చు.

బిందు మాధవి

తెలుగు సినిమాలతో ఎంటర్ టైన్ చేసిన బిందు మాధవి ఈ బ్లాక్ మెయిల్ మూవీలో కీ రోల్ లో కనిపించింది. ఇందులో జీవీ ప్రకాశ్ కుమార్, శ్రీకాంత్, తేజు అశ్విని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ము మారన్ డైరెక్ట్ చేశాడు. 2025 సెప్టెంబర్ 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది.

బ్లాక్ మెయిల్ కథ

మణి (జీవీ ప్రకాశ్) ఓ ఫార్మాసూటికల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర పని చేస్తుంటాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ సీక్రెట్ గా కొకైన్ కూడా అమ్ముతుంటాడు. మరోవైపు ఫార్మాసీలో పని చేసే మణి గర్ల్ ఫ్రెండ్ రేఖ (తేజు అశ్విని) ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అబార్షన్ చేయించుకోవాలని అనుకుంటుంది. కానీ తల్లిని, పిల్లను హ్యాపీగా చూసుకుంటానని మణి చెప్తాడు.

పాప కిడ్నాప్

మరోవైపు అశోక్ (శ్రీకాంత్) కూతురు అను కిడ్నాప్ అవుతుంది. ఇంకోవైపు అర్చన (బిందు మాధవి)ను ఎక్స్ లవర్ డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూనే ఉంటాడు. వీళ్ల జీవితాలలో ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి. బ్లాక్ మెయిల్ కు గురవుతూనే ఉంటారు. మణిని పోలీసులు అరెస్టు చేస్తారు.

అసలు ఈ సినిమాలో రియల్ విలన్ ఎవరు? మణిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? అశోక్ పాపను కిడ్నాప్ చేసింది ఎవరు? పాప ఆచూకీ దొరకకపోయినా అశోక్ ఎందుకు పోలీసులకు కంప్లయింట్ ఇవ్వలేదు? బిందు మాధవి కథ ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ థ్రిల్లర్ సినిమా బ్లాక్ మెయిల్ చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More