కిరణ్ అబ్బవరం రొమాంటిక్ మూవీ.. కె ర్యాంప్ వచ్చేది ఈ ఓటీటీలోకే!

కె ర్యాంప్ తో థియేటర్లలో సందడి చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. పాజిటివ్ టాక్ తో ఈ మూవీ దూసుకెళ్తోంది. కిరణ్ ఖాతాలో మరో విక్టరీ చేరిందనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.  మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి? ఎప్పుడు వస్తుందో చూసేయండి. 

Published on: Oct 19, 2025, 19:20:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘కె ర్యాంప్’ థియేటర్లలో అదరగొడుతోంది. ఈ సినిమా ఫస్ట్ డే కంటే సెకండ్ డే ఎక్కువ కలెక్షన్లు సాధించింది. క్రమంగా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏదో ఇక్కడ చూసేయండి.

ఓటీటీలోకి కె ర్యాంప్ (x/Kiran_Abbavaram)
ఓటీటీలోకి కె ర్యాంప్ (x/Kiran_Abbavaram)

కె ర్యాంప్ ఓటీటీ

తెలుగులో రీసెంట్ గా వచ్చిన మూవీ కె ర్యాంప్. కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ ప్లే చేశాడు. ఇది అక్టోబర్ 18, 2025నాడు థియేటర్లలో రిలీజైంది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ ఆహా ఓటీటీలోకి రాబోతుంది.

ఓటీటీ రిలీజ్ డేట్

కె ర్యాంప్ మూవీ ఆహా ఓటీటీలోకి రానుంది. అయితే రిలీజ్ డేట్ పై ఇంకా మేకర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. కానీ తెలుగు సినిమాల సాధారణ ఓటీటీ విండో నాలుగు వారాలు. అంటే థియేటర్లలో నాలుగు వారాలు నడిచిన తర్వాత సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే కె ర్యాంప్ నవంబర్ మూడో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.

ఓటీటీ రైట్స్

కె ర్యాంప్ ఓటీటీ రైట్స్ ను ఆహా ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుందని ఓటీటీ ప్లే తన రిపోర్ట్ లో పేర్కొంది. గతేడాది క సినిమాతో కిరణ్ అబ్బవరం ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాతి దిల్ రూబాతో నిరాశపర్చాడు. అయినా మినిమం హిట్ హీరోగా కిరణ్ అబ్బవరం పేరు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో కె ర్యాంప్ ఓటీటీ రైట్స్ కోసం ఆహా ఫ్యాన్సీ రేటు చెల్లించిందని టాక్.

ఫస్ట్ డే కలెక్షన్లు

కె ర్యాంప్ సినిమాకు మొదట మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. తొలి రోజు ఈ మూవీ రూ.4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. అయితే ఫస్ట్ రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు పెరిగాయని నిర్మాణ సంస్థ వెల్లడించింది. మరోవైపు దీపావళి సెలవు కారణంగా కె ర్యాంప్ కలెక్షన్లు మరింత జోరందుకునే అవకాశముంది.

మరోవైపు కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. అతని లైనప్ లో క్రేజీ మూవీస్ ఉన్నాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నాడని తెలిసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More