తొలి రోజు కిరణ్ అబ్బవరం దూకుడు.. కె ర్యాంప్ మూవీ వరల్డ్ వైడ్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇవే.. పెరుగుకుంటూ పోయిన ఆక్యుపెన్సీ

కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ కె ర్యాంప్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన కె ర్యాంప్‌లో యుక్తి తరేజ హీరోయిన్‌గా చేసింది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన కె ర్యాంప్ అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది. మరి కె ర్యాంప్ సినిమాకు తొలి రోజు వచ్చిన కలెక్షన్స్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.

Updated on: Oct 19, 2025, 11:44:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఇదివరకు క సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ కె ర్యాంప్. రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కె ర్యాంప్ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించారు.

తొలి రోజు కిరణ్ అబ్బవరం దూకుడు.. కె ర్యాంప్ మూవీ వరల్డ్ వైడ్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇవే.. పెరుగుకుంటూ పోయిన ఆక్యుపెన్సీ
తొలి రోజు కిరణ్ అబ్బవరం దూకుడు.. కె ర్యాంప్ మూవీ వరల్డ్ వైడ్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇవే.. పెరుగుకుంటూ పోయిన ఆక్యుపెన్సీ

కె ర్యాంప్‌కు పాజిటివ్ టాక్

కె ర్యాంప్ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా కిరణ్ అబ్బవరంకు జోడీ కట్టింది. అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది కె ర్యాంప్ సినిమా. అయితే, ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కానీ, సెకండాఫ్ మాత్రం చాలా ఫన్ అండ్ కామెడీతో ఆకట్టుకుంటుందని పాజిటివ్‌గా చెబుతున్నారు.

కె ర్యాంప్ నెట్ కలెక్షన్స్

ఈ నేపథ్యంలో కె ర్యాంప్ సినిమాకు తొలి రోజు కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. కె ర్యాంప్ సినిమాకు భారతదేశంలో ఓపెనింగ్ అయిన శనివారం రోజున రూ. 2.15 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చిటన్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ రాసుకొచ్చింది. అయితే, అక్టోబర్ 17న రిలీజ్ అయిన డ్యూడ్, తెలుసు కదా సినిమాలతో కె ర్యాంప్ పోటీ పడిన మంచి కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల వసూళ్లు

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో మంచి ట్రెండ్‌తోనే దూసుకుపోతోంది కె ర్యాంప్ సినిమా. ఏపీ, తెలంగాణలో కె ర్యాంప్ మూవీకి తొలి రోజున రూ. 1.4 నుంచి 1.6 కోట్ల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలిపారు. అయితే, ఇవి ఆన్‌లైన్ టికెట్స్ లెక్కల వరకే. ఆఫ్‌లైన్ టికెట్స్ లెక్కలు కూడా తెలిస్తే కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

కె ర్యాంప్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

అలాగే, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద కె ర్యాంప్ బాగానే నెట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున కె ర్యాంప్ సినిమా రూ. 2 కోట్ల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ రాబట్టనుందని సమాచారం. ఈ లెక్కన కె ర్యాంప్ సినిమాకు సుమారుగా రూ. 4 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

పెరుగుకుంటూ పోయిన ఆక్యుపెన్సీ

ఇక తెలుగులో కె ర్యాంప్ సినిమాకు విడుదలైన అక్టోబర్ 18 రోజున 37.10 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. దీంట్లో ఉదయం షోలకు 26.11 శాతం, మధ్యాహ్నాం 35.14, సాయంత్రం 35.98 శాతం, రాత్రి 51.27 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది. అంటే, షోకి షోకి ఆక్యుపెన్సీ పెరుగుకుంటూ పోయిందని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More