రాజమౌళి విజన్‌కు సలాం.. నాపై అతిపెద్ద ప్రభావం అదే: బాహుబలి ది ఎపిక్‌పై రానా దగ్గుబాటి

ఎస్ఎస్ రాజమౌళి రీమాస్టర్ చేసిన 'బాహుబలి: ది ఎపిక్' సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో మళ్లీ విడుదలైంది. ఈ 3 గంటల నిడివి ఉన్న కట్‌ను తాను చూసినట్లు రానా దగ్గుబాటి చెప్పారు. ఈ మూవీ చూశాక తనకు కలిగిన ఫీలింగ్ ను పంచుకున్నారు. 

Published on: Nov 10, 2025, 05:58:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాహుబలి ది ఎపిక్ చూసిన రానా దగ్గుబాటి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి విజన్ కు సలామ్ అని చెప్పారు. నటుడు, నిర్మాత అయిన రానా దగ్గుబాటి తన రాబోయే చిత్రం 'కాంత' ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తన కెరీర్‌లోని అత్యంత ఐకానిక్ చిత్రాలలో ఒకటైన 'బాహుబలి: ది ఎపిక్' రీ-రిలీజ్ గురించి కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. గలాటా ప్లస్‌తో జరిపిన సంభాషణలో ఆ సినిమాను మళ్లీ చూడటంపై తన ఆలోచనలను పంచుకున్నారు.

బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి
బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి

మొదటి కథ అదే

భారతీయ సినిమాకు ఒక బెంచ్‌మార్క్ సెట్ చేసిన బాహుబలి చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరించారనే దానిపై కూడా రానా దగ్గుబాటి మాట్లాడారు. 3 గంటల 40 నిమిషాల నిడివి గల కట్ ను చూడగలిగారా అని రాణాను అడగగా, ఆయన అవును అని చెప్పి, సినిమా విడుదలైన దశాబ్దం తర్వాత దానిని చూడటం ఎలా ఉందో పంచుకున్నారు.

“అది చాలా సరదాగా ఉంది, ఎందుకంటే అదే మాకు చెప్పిన మొదటి కథ అదే. ఒకానొక సమయంలో అది ఒకే సినిమాగా ఉండాల్సింది. కానీ అది చాలా పొడవైన ఒకే చిత్రం. దానిని మళ్లీ చూడటం అద్భుతంగా ఉంది. దశాబ్దం తర్వాత మేము దానిని పెద్ద తెరపై చూడగలిగాం. ఇంకా అది చాలా అందంగా ఉంది’’ అని రానా చెప్పారు.

రాజమౌళి విజన్

"భారతదేశంలో మీరు పురాణాల కథలతో, యుద్ధాలు, దేవుళ్లు, రాజుల కథలతో పెరుగుతారు. వీటిల్లో ఒక చలనచిత్రంగా మీకు ఉన్న ఏకైక ఉదాహరణ 'బాహుబలి'. మహాభారతంలోని యోధులు ఇలా ఉండి ఉండవచ్చు అని ఆ చిత్రం తెరపైకి వచ్చింది. అది కూడా మిస్టర్ రాజమౌళి లాంటి వ్యక్తి విజన్ తో. అందుకు సలాం. ఆయన విజన్ తో ప్రతి సరిహద్దును ఛేదించారు. ఆ మొత్తం బృందం ఆ సినిమా తీయడానికి తమ శాయశక్తులా కృషి చేసింది. అది నా జీవితంలో ఎప్పుడూ అతిపెద్ద ప్రభావం చూపే అంశంగా ఉంటుంది” అని రానా పేర్కొన్నారు.

'బాహుబలి ది ఎపిక్' గురించి

రాజమౌళి బ్లాక్‌బస్టర్‌లైన బాహుబలి: ది బిగినింగ్ (2015), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017) కలిపి బాహుబలి ది ఎపిక్ గా మార్చారు. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయగా, అనుష్క శెట్టి, రమ్య కృష్ణన్, సత్యరాజ్, రాణా దగ్గుబాటి, నాజర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ రీ-రిలీజ్ కోసం సినిమాను రీమాస్టర్ చేశారు. దీనిలో సౌండ్, విజువల్స్ రెండింటినీ థియేటర్లకు తిరిగి రాకముందు పూర్తిగా మార్చారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More