ప్రభాస్‌కు రష్మిక ఓపెన్ ఆఫర్.. స్పెషల్ మూవీలో కలిసి వర్క్ చేయాలని ఉంది.. డార్లింగ్ ఈ మెసేజ్ చూస్తాడా?

ప్రభాస్ తో నటించాలని ఉందని నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలిపింది. త్వరలోనే స్పెషల్ సినిమా కోసం కలిసి పని చేస్తామనే ఆశాభావం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఆమె కామెంట్ వైరల్ గా మారింది. 

Published on: Nov 04, 2025 5:58 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రష్మిక మందన్న ఇప్పుడు ఇండియాలో చాలా బిజీ హీరోయిన్. 2025లో ఆమె నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అంటూ అయిదో మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. మరోవైపు తన రీసెంట్ హారర్ థ్రిల్లర్ థామా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో కలిసి నటించాలనే కోరికను వెల్లడించింది రష్మిక.

రష్మిక, ప్రభాస్
రష్మిక, ప్రభాస్

ప్రభాస్ తో మూవీ

థామాలో రక్త పిశాచిగా రష్మిక మందన్న అదరగొట్టింది. ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. ఈ నేషనల్ క్రష్ ఇప్పటికే రణబీర్ కపూర్ నుండి అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్ వరకు పలువురు పెద్ద స్టార్లతో కలిసి పనిచేసింది. అయితే ఒక ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయాలని ఆమె కోరుకునే నటుడు ఎవరైనా ఉన్నారంటే, అది ప్రభాస్.

స్పెషల్ సినిమా

ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో అభిమానుల ప్రశ్నలకు రష్మిక మందన్న సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఒక అభిమాని కింద పడుకొని ఉన్ని బ్రహ్మానందం ఫొటో పోస్టు చేసి.. "భారతదేశపు అతిపెద్ద సూపర్ స్టార్ ప్రభాస్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందా? ఒకవేళ అది జరిగితే, థియేటర్‌లో నా శవాన్ని సేకరించండి నా రష్షు" అని పోస్టు చేశాడు.

దీనిపై స్పందించిన రష్మిక.. “😆😆😆😆🩷 ఇది నాకు నచ్చింది.. ప్రభాస్ సర్ ఈ సందేశాన్ని చూస్తారని నేను ఆశిస్తున్నాను, మేమిద్దరం త్వరలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేస్తామని కూడా ఆశిస్తున్నాను! 🩷” అని పేర్కొంది.

స్పిరిట్ మిస్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చిత్రంలో ప్రభాస్ సరసన నటించడానికి రష్మికతో చర్చలు జరుగుతున్నాయని మొదట్లో అనేక నివేదికలు వచ్చాయి. అయితే ఈ పాత్రకు దీపికా పదుకొణె ఖరారైనట్లు తర్వాత వార్తలు వచ్చాయి. ఆమె ఈ చిత్రం నుండి ఆశ్చర్యకరంగా తప్పుకున్న తర్వాత, తృప్తి డిమ్రిని ఈ చిత్రంలోకి తీసుకున్నారు. రష్మిక, తృప్తి ఇద్దరూ సందీప్ గత చిత్రం 'యానిమల్'లో రణబీర్ కపూర్ సరసన నటించారు.

థామా సక్సెస్

రష్మిక 2025లో 'ఛావా', 'సికందర్', 'కుబేరా', ‘థామా’ చిత్రాలతో థియేటర్లో సందడి చేసింది. ఈ నాలుగు సినిమాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. ఇప్పుడు ఈ ఏడాది అయిదో సినిమా ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ కు రెడీగా ఉంది. థామాలో రష్మిక యాక్టింగ్ కు ప్రశంసలు దక్కాయి. దీనికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించగా, మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మించింది.

హారర్ యూనియర్స్

మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో అయిదో సినిమాగా థామా తెరకెక్కింది. 'స్త్రీ', 'భేడియా', 'ముంజ్యా', 'స్త్రీ 2' లాంటి సినిమా ఈ యూనివర్స్ లో వచ్చాయి. థామాలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ తదితరులు నటించారు. ఈ యూనివర్స్ లో తదుపరి చిత్రం ‘శక్తి శాలిని’. ఇందులో 'సైయారా' ఫేమ్ అనీత్ పడ్డా ప్రధాన పాత్రలో నటించనుంది.