ఓటీటీలో రష్మిక మందన్న హారర్ రొమాంటిక్ థ్రిల్లర్.. 100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వరుసగా సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతోంది రష్మిక మందన్న. ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా యాక్ట్ చేసిన నాలుగో సినిమా కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ హారర్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ నెలకొంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో చూసేద్దాం.
ఒక దాని తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందిస్తూ, బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ సూపర్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది రష్మిక మందన్న. ఆమె నటించిన లేటెస్ట్ హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘థామా’. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు ఖాతాలో వేసుకుంది. మరి ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

థామా ఓటీటీ
రష్మిక మందన్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ థామా ఓటీటీ రిలీజ్ డేట్ పై క్రేజీ బజ్ నెలకొంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందు కోసం ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ కళ్లు చెదిరే రేట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 21న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది.
స్ట్రీమింగ్ ఎప్పుడు?
రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన థామా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కావడం ఖాయమైంది. అయితే ఎప్పుడు ఓటీటీలో అడుగుపెడుతుందన్నది ప్రశ్నగా మారింది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోతో మేకర్స్ ముందే డీల్ సెట్ చేసుకున్నారని టాక్.
8 వారాల తర్వాత
థియేటర్లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకురావాలన్నది డీల్ సారాంశం. ఈ రకంగా చూసుకుంటే డిసెంబర్ రెండో వారంలో థామా ఓటీటీ డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీనిపై అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసే అవకాశముంది. థామా మూవీకి ఆదిత్య సర్పోదార్ డైరెక్టర్. మడోక్ ఫిలింస్ బ్యానర్ పై దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావెల్ తదితరులు నటించారు.
థామా కలెక్షన్స్
థామా సినిమా అయిదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది. ఇండియాలో రూ.78.6 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడీ మూవీ కలెక్షన్లు రూ.110 కోట్లు దాటాయి. మడోక్ హారర్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన అయిదో సినిమా థామా.
ఈ సినిమాలో రష్మిక మందన్న మనుషుల రక్తాన్ని తాగే బేతాళి జాతికి చెందిన రాక్షసిగా నటించింది. ఆయుష్మాన్ ఖురానా కూడా బేతాళుడగా మారతాడు. ఈ ఇద్దరికీ లవ్ కుదురుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ బేతాళ కథ ఏంటీ? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


