బాక్సాఫీస్ క్వీన్ రష్మిక మందన్న.. 100 కోట్లు దాటిన థామా కలెక్షన్లు.. 2025లోనే నేషనల్ క్రష్ నాలుగో మూవీ

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాక్సాఫీస్ క్వీన్ గా మారింది. ఆమె లేెటెస్ట్ మూవీ థామా రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసింది. 2025లోనే ఆమె నాలుగు సినిమాలు రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం.

Published on: Nov 03, 2025 6:02 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాక్సాఫీస్ ను ఏలుతోంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలన్నీ వరుసగా రూ.100 కోట్ల కలెక్షన్లు దాటి దూసుకెళ్తున్నాయి. 2025లో రష్మిక మందన్న నటించిన నాలుగు సినిమాల వసూళ్లు రూ.100 కోట్లు దాటేశాయి. రీసెంట్ హారర్ థ్రిల్లర్ థామా ఈ క్లబ్ లో చేరింది.

రష్మిక మందన్న థామా కలెక్షన్లు
రష్మిక మందన్న థామా కలెక్షన్లు

థామా కలెక్షన్లు

ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన థామా చిత్రం భారతదేశంలో మంచి విజయాన్ని సాధిస్తోంది. సక్నిల్క్ ప్రకారం థామా ఇప్పటివరకు ఇండియాలో రూ.119.65 కోట్లు సంపాదించింది. ఈ చిత్రాన్ని దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు.

ఫస్ట్ వీక్

థామా ఫస్ట్ వీక్ లోనే ఇండియాలో రూ.108.4 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ హిందీలో రూ.107.52 కోట్లు, తెలుగులో రూ.88 లక్షలు తొలి వారంలో దక్కిచుకుంది. 11 వ రోజు రూ.3 కోట్లు, 12 రోజు రూ.4.4 కోట్లు, 13వ రోజు రూ.3.85 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు రూ.119.65 కోట్లు వసూలు చేసింది.

థామా గురించి..

మాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్ లో థామా అయిదో ఫిల్మ్. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ కూడా నటించారు. రక్త పిశాచిగా మారి రష్మిక పాత్రతో ప్రేమలో పడే ఆయుష్మాన్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఇది మలుపులతో నిండిన "నెత్తుటి ప్రేమకథ"కు దారితీస్తుంది. అతను రక్త పిశాచి లాంటి వ్యక్తిగా రూపాంతరం చెందే జర్నలిస్టుగా నటించాడు. రష్మిక బేతాళిగా నటించింది.

నాలుగో మూవీ

వరుస సినిమాలతో, బ్లాక్ బస్టర్ హిట్లతో రష్మిక మందన్న దూసుకెళ్తోంది. 2025లో ఇప్పటికే రష్మిక మందన్న హీరోయిన్ గా యాక్ట్ చేసిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాలు రూ.100 కోట్ల కలెక్షన్లలు అలవోకగా అందుకున్నాయి. ఈ ఏడాది ఫస్ట్ ఛావాతో థియేటర్లకు వచ్చింది రష్మిక. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

సల్మాన్ తో

ఛావా తర్వాత సల్మాన్ ఖాన్ తో రష్మిక నటించిన సికందర్ రిలీజైంది. నెగెటివ్ టాక్ వచ్చినా ఈ మూవీ రూ.200 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ కుబేరలో మెరిసింది రష్మిక. ఈ సినిమా రూ.130 కోట్లు సంపాదించింది. ఇప్పుడు థామాతో మరోసారి రూ.100 కోట్ల మూవీ దక్కించుకుంది నేషనల్ క్రష్.

అంతకుముందు యానిమల్, పుష్ఫ 2తోనూ కలెక్షన్ల మోత మోగించింది రష్మిక. ఇలా చూసుకుంటే రూ.100 కోట్లు దాటిన సినిమాల్లో థామా ఆమెకు వరుసగా ఆరో చిత్రం.