రష్మిక మందన్న హారర్ కామెడీ థ్రిల్లర్.. థామాకు షాక్.. రెండో రోజు తగ్గిన కలెక్షన్లు.. వీకెండ్ పైనే ఆశలు
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన హారర్ కామెడీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తోంది. అయితే రెండో రోజు వసూళ్లు కాస్త తగ్గాయి.
థామా బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 2: మాడాక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో వచ్చిన లేటెస్ట్హారర్ కామెడీ థామా బాక్సాఫీస్ దగ్గర నిలకడగా సాగుతోంది. బాక్సాఫీస్ రన్నింగ్ కొనసాగిస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన ఈ మూవీ రెండో రోజు కలెక్షన్లను కాస్త తగ్గాయి. వర్కింగ్ డే కావడం ప్రభావం చూపింది. దీపావళి సందర్భంగా థామా అక్టోబర్ 21న రిలీజైంది.

పాజిటివ్ టాక్
రష్మిక మందన్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ థామాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఇందులోని కామెడీ, హారర్, రొమాన్స్ సరిగ్గా కుదిరాయనే కామెంట్లు వస్తున్నాయి. ఓపెనింగ్ రోజైన మంగళవారం (అక్టోబర్ 21) ఈ మూవీ ఇండియాలో రూ.25.11 కోట్లతో మంచి ఓపెనింగ్ దక్కించుకుంది. అయితే బుధవారం వర్కింగ్ డే కావడంతో వసూళ్లు కాస్త తగ్గాయి.
థామా కలెక్షన్లు
మంగళవారం ఇండియాలో థామా సినిమా రూ.25 కోట్లకు పైగా వసూలు చేసింది. మొదటి రోజు సినిమాకు రూ.25.11 కోట్లు వచ్చాయని మాడాక్ ఫిల్మ్స్ తెలిపింది. రెండో రోజున ఈ హారర్ థ్రిల్లర్ రూ.18 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. దీంతో రెండు రోజుల్లో ఈ మూవీ కలెక్షన్లు రూ.43 కోట్లకు చేరుకున్నాయి. ఈ చిత్రం రెండో రోజు గణనీయమైన తగ్గింపును చూసింది. ఎందుకంటే మార్నింగ్ షోలు కేవలం 10% ఆక్యుపెన్సీని మాత్రమే నమోదు చేశాయి.
వీకెండ్ పై ఆశలు
థామా మూవీ వీకెండ్ పై ఆశలు పెట్టుకుంది. అయితే అంతకంటే ముందు గురువారం, శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఈ మూవీకి అతిపెద్ద పరీక్ష. దీపావళి సెలవుదినం, మంచి సమీక్షలు బాక్సాఫీస్ వద్ద అవసరమైన పుష్ ను ఇచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రం భారీ వీకెండ్ కు రెడీ అయింది.
రూ.100 కోట్లు
వీకెండ్ లో థామా మూవీ కలెక్షన్లలో అదరగొట్టే అవకాశముంది. వీకెండ్ లో ఈ మూవీ వసూళ్లు రూ.100 కోట్ల కంతే తక్కువ వస్తే మాత్రం అది పూర్తిగా నిరాశపర్చినట్లేనని వాణిజ్య పండితులు అంటున్నారు.
మాడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా థామా సినిమాను తీసుకొచ్చారు. ఇందులో గతంలో స్త్రీ ఫ్రాంఛైజీ, భేడియా, ముంజ్య చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు థామా ఇందులో చేరింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్, రష్మిక, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం చాలా వరకు సానుకూల సమీక్షలను అందుకుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


