థామా కలెక్షన్స్ డే 1: తొలి రోజే 24 కోట్లు రాబట్టిన రష్మిక మందన్నా హారర్ కామెడీ మూవీ- కానీ, ఆ 2 సినిమాల కంటే తక్కువే!
థామా బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 1: రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ థామా అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో థామా మొదటి రోజు కలెక్షన్స్ వివరాలపై ఆసక్తి నెలకొంది. మరి థామా ఓపెనింగ్ కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.
దీపావళి సందర్భంగా అభిమానులకు మరో హారర్ కామెడీ మూవీ థామాతో బహుమతి ఇచ్చింది బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా జంటగా నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన హర్రర్-కామెడీ చిత్రం థామా.

మాడాక్ ఫిల్మ్స్ యూనివర్స్ నుంచి
భారీ అంచనాల మధ్య అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైంది థామా. మాడాక్ ఫిల్మ్స్ యూనివర్స్ నుంచి ఐదో చిత్రంగా వచ్చిన థామా థియేటర్ల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో థామా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
థామా తొలి రోజు కలెక్షన్స్
థామా మూవీ ఇండియాలో తొలి రోజున రూ. 24.87 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపినట్లు బాలీవుడ్ మీడియా సైట్స్ పేర్కొన్నాయి. అయితే, ఈ దివాళికి బాలీవుడ్ నుంచి రష్మిక మందన్నా థామా సినిమాకు పెద్దగా బాక్సాఫీస్ పోటీ లేదు.
థామాకు లేని బాక్సాఫీస్ పోటీ
ఈ పండుగ సందర్భంగా థామాతోపాటు ఒకే ఒక్క సినిమా ఏక్ దీవానే కి దీవానియత్ మాత్రమే థియేటర్లలో రిలీజ్ అయింది. దీంతో థామాకు పెద్ద పోటీ లేకుండా పోయింది. కానీ, ఇదే మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ నుంచి చివరిగా వచ్చిన మరో హారర్ కామెడీ సినిమా స్త్రీ 2 కంటే థామా కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయి.
స్త్రీ 2 కలెక్షన్స్
గతేడాది ఇదే యూనివర్స్ నుంచి శ్రద్ధా కపూర్ స్త్రీ 2 సినిమా ఓపెనింగ్ రోజున రూ. 35 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక గత దీపావళికి విడుదలైన మరో హారర్ కామెడీ జోనర్ మూవీ భూల్ భులయ్యా 3 మూవీ కంటే కూడా థామా బాక్సాఫీస్ వసూల్లు తక్కువగా ఉన్నాయి.
భూల్ భులయ్యా 3 వసూళ్లు
కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, తృప్తి దిమ్రి, మాధురి దీక్షిత్, రాజ్‌పాల్ యాదవ్ వంటి పాపులర్ నటీనటులు యాక్ట్ చేసిన భూల్ భులయ్యా 3 మూవీ తొలి రోజున ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 32 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టింది.
థామా థియేటర్ ఆక్యుపెన్సీ
హారర్ కామెడీగా వచ్చిన థామా అదే జోనర్ సినిమాలైన స్త్రీ 2, భూల్ భులయ్యా 3 వంటి రెండింటి కంటే తక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించింది. ఇకపోతే తొలి రోజున (అక్టోబర్ 21) హిందీలో థామాకు ఓవరాల్‌గా 34.50 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.
ఇప్పటికీ నాలుగు సినిమాలు
దీనిలో ఉదయం షోలకు 15.76 శాతం, మధ్యాహ్నాం 39.81 శాతం, సాయంత్రం 42.91 శాతం, రాత్రి షోలకు 39.50 శాతంగా థామా థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది. ఇదిలా ఉంటే, థామా సినిమాకు ఆదత్య సర్పతోత్దార్ దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో ఇప్పటికి స్త్రీ, భేడియా, ముంజ్యా, స్త్రీ 2 సినిమాలు వచ్చాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


