కూతురు సితార, సోదరి శిల్పాతో కలిసి నమ్రతా శిరోద్కర్ దీపావళి వేడుకలు.. మహేశ్ బాబు ఎక్కడంటూ ప్రశ్నలు
సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన కూతురు సితారా, సోదరి శిల్పా శిరోద్కర్‌తో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి చూసిన సూపర్ స్టార్ అభిమానులు, నెటిజన్స్ మహేశ్ బాబు ఎక్కడంటూ ప్రశ్నలు వేశారు.
దేశంలో దీపావళి పండుగ వేడుకలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా అంతా దివాళీని సెలబ్రేట్ చేసుకుంటారు. సినీ సెలబ్రిటీలు కూడా తమ సన్నిహితులు, కుటుంబీకులు, బంధువులతో దీపావళి పండుగను సంతోషంగా ఆస్వాదిస్తున్నారు.

నమ్రతా శిరోద్కర్ దివాళి వేడుకలు
ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ దీపావళి వేడుకలను జరుపుకున్నారు. కూతురు సితార, సోదరి శిల్పా శిరోద్కర్‌తో కలిసి నమ్రతా శిరోద్కర్ దివాళి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నమ్రతా శిరోద్కర్.
మరుపురాని దివాళి రాత్రులు
ఈ ఫొటోలకు "వెలుగులు, అద్భుతమైన మనుషులుతో ఈ సాయంత్ర నిండిపోయింది. నిజంగా మరుపురాని దివాళి రాత్రులు" అని క్యాప్షన్ రాసుకొచ్చారు నమత్రా శిరోద్కర్. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో సితార, నమ్రతా శిరోద్కర్ ఎంతో అందంగా కనిపించారు.
ఒక్కటి తక్కువైందని
నమ్రతా శిరోద్కర్ గులాబీ రంగు దుస్తుల్లో అద్భుతంగా కనిపిస్తే.. సితార బంగారు-పసుపు లెహంగాలో మెరిసిపోయింది. అయితే, ఈ ఫొటోల్లో ఒక్కటి తక్కువైందని నెటిజన్స్ గమనించారు. ఫొటోల్లో లేని సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ రూపంలో అడగడం మొదలుపెట్టారు.
మహేశ్ బాబు ఎక్కడంటూ
'మా సూపర్ స్టార్ ఎక్కడ?' అని ఒకరు రాశారు. మరికొందరు 'బాబు ఎక్కడ ఉన్నారు', 'బాబు ఎక్కడ ఉన్నారు' అని ప్రశ్నించారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు నమ్రతను తన కుమార్తెతో మరిన్ని చిత్రాలను పంచుకోమని కోరారు.
అభిమానుల నిరాశ
ఇలా నమ్రతా దివాళి వేడుకల్లో మహేశ్ బాబు లేకపోవడం సూపర్ స్టార్ అభిమానులు నిరాశ చెందారు. ఇదిలా ఉంటే, మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29) మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.
పెద్దమ్మగా ప్రియాంక చోప్రా
ఇటీవలే ప్రియాంక చోప్రా పెద్దమ్మగా మారింది. ప్రియాంక చోప్రా కజిన్ సోదరి పరిణీతి చోప్రా బేబీ బాయ్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ బాహుబలి సినిమా రెండు పార్ట్స్ ఒక్కటిగా మారి బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్‌తో రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


