ఏడేళ్ల క్రితమే బాహుబలి ది ఎపిక్ రిలీజ్‌పై ఆలోచన- 500 కోట్లు రాబట్టొచ్చు అంటూ పారిశ్రామిక వేత్త ట్వీట్
బాహుబలి ది ఎపిక్ 2025 రిలీజ్‌కు అసలు కారణం ప్రముఖ పారిశ్రామిక వేత్త, లాయిడ్ గ్రూప్ అధినేత విక్రం నారాయణరావు అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బాహుబలి రెండు భాగాలను ఒకే పార్ట్ కింద రాజమౌళికి విక్రమ్ నారాయణ రావు ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సిరీస్ బాహుబలి. ఈ ఫ్రాంచైజీ నుంచి రెండు పార్ట్స్ వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అండ్ టీమ్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ వచ్చింది.

అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్
వరల్డ్ వైడ్‌గా కూడా ఇండియన్ సినిమా సత్తా చాటగలదు అని నిరూపించిన సినిమా బాహుబలి. అయితే, ఈ సినిమా రెండు పార్టులు కలిపి ఇప్పుడు ఒకే పార్టు కింద ‘బాహుబలి- ది ఎపిక్ 2025’ పేరుతో ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను దర్శకుడు రాజమౌళి పూర్తి చేశారు.
లాయిడ్ గ్రూప్ అధినేత ట్వీట్
బాహుబలి ది ఎపిక్ రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలు అని కూడా చెప్పేశారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. బాహుబలి 2 విడుదలైన వారానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త, లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణరావు ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశారు. అది కూడా దర్శకుడు రాజమౌళిని ట్యాగ్ చేస్తూ ఆ ట్వీట్ చేశారు.
రెండు పార్ట్స్ కలపడం వెనుక కారణం
మే 6వ తేది 2017న ఈ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. అంటే.. బాహుబలి2 విడుదలైన (ఏప్రిల్ 28, 2017) వారం రోజులకు ఈ ట్వీట్ చేశారన్నమాట. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. బాహుబలి ది ఎపిక్ టైటిల్‌తో రెండు పార్ట్స్ కలపడం వెనుక ఉన్న అసలు కారణం ఇతనే అని టాక్ నడుస్తోంది.
500 కోట్లు రాబట్టొచ్చు
ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందనే ఆసక్తి కలుగుతోంది. "రాజమౌళి గారు.. బాహుబలి పార్ట్ 1,2 కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చేయండి. ఇది ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం అవుతుంది. ఈ అద్భుతంతో మళ్లీ తక్కువలో తక్కువగా రూ.500 కోట్లు కలెక్షన్స్ రాబట్టవచ్చు. అలాగే ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని మీ ఎడిటింగ్ సామర్థ్యాలతో చూపించవచ్చు" అని ట్వీట్ వేశారు విక్రం నారాయణ రావు.
విక్రమ్ నారాయణ సంతోషం
తన వ్యాపార సామర్థ్యాలతో లాయిడ్ గ్రూప్ అధినేతగా ఎదిగిన విక్రమ్ నారాయణ తన ముందు చూపు ఆలోచనతో రెండు పార్టులుగా విడుదలైన ఓ సినిమాను ఒకే పార్టు కింద రిలీజ్ చేయండని చెప్పడం, ఏడేళ్ల క్రితం తను ట్విట్టర్‌లో పంచుకున్న అభిప్రాయం ఇప్పుడు నిజం అవుతున్నందుకు చాలా సంతోషపడుతున్నారు.

నటనతో మెప్పించి
దీంతో ఏడేళ్ల క్రితమే చేసిన ఈ ఆలోచనపై విక్రం నారాయణ రావును పలువురు అభినందిస్తున్నారు. ఇలా ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు తమ నటనతో మెప్పించిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


