సందీప్ వంగా స్టైలే అంతా.. స్పిరిట్‌లో ప్రభాస్ న్యూడ్ సీన్.. డార్లింగ్‌ను నగ్నంగా చూపించబోతున్నాడా? లేటెస్ట్ బజ్!
ప్రభాస్ రాబోయే చిత్రం 'స్పిరిట్'లో బోల్డ్ సన్నివేశాలు ఉండవచ్చనే బజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇది సందీప్ రెడ్డి వంగా గత చిత్రాలను గుర్తుచేస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
సందీప్ రెడ్డి వంగా.. ఈ సంచలన డైరెక్టర్ మేకింగ్ స్టైలే వేరు. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు అతని సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. హీరోలను బోల్డ్ గా చూపించడానికి సందీప్ అస్సలు వెనుకాడడు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కించనున్న స్పిరిట్ మూవీలోనూ సందీప్ మరోసారి బోల్డ్ సీన్లతో రాబోతున్నడానే బజ్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.

బోల్డ్ సీన్
ప్రభాస్ అభిమానులు మరోసారి ఉత్సాహంతో ఊగిపోతున్నారు, కానీ ఈసారి ఆయన యాక్షన్ సన్నివేశాల వల్ల కాదు. సందీప్ రెడ్డి వంగా రాబోయే చిత్రం 'స్పిరిట్' ఆడియో టీజర్ ఆన్‌లైన్‌లో ఒక సంచలనాన్ని సృష్టించింది. ఆ టీజర్‌లోని ఒకే ఒక్క బోల్డ్ డైలాగ్ తో డార్లింగ్ ముందెన్నడూ ప్రయత్నించని సాహసోపేతమైన సన్నివేశం ఉండబోతోందనేది తెలుస్తోంది.
న్యూడ్ గా ప్రభాస్
ప్రభాస్ 46వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్పిరిట్ ఆడియో టీజర్ వైరల్ గా మారింది. ఇందులో ఒక జైలర్, రిమాండ్‌లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ గురించి తన సహాయకుడికి సూచనలు ఇస్తుంటాడు. మర్యాదగా ప్రవర్తించాలని సహాయకుడు గుర్తు చేయగా, ఆ ఖైదీ బట్టలు విప్పాలని జైలర్ చెప్పి అందరినీ షాక్‌కు గురిచేస్తాడు. ఈ ఒక్క డైలాగ్ సోషల్ మీడియాలో మంటలు రేపింది. సినిమాలో ప్రభాస్ నగ్నంగా కనిపించవచ్చని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు.
సందీప్ స్టైల్లో
తన సినిమాల్లో హీరోలను న్యూడ్ గా చూపించడం సందీప్ కు కొత్తేం కాదు. అతని లాస్ట్ మూవీ యానిమల్ లోనూ రణబీర్ కపూర్ నగ్నంగా కనిపించారు. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర నివేదిక ప్రకారం స్పిరిట్ లో ఒక బోల్డ్ సన్నివేశం ఉండవచ్చని తెలుస్తోంది. అయితే అది స్పష్టంగా ఉంటుందా? లేదా క్రియేటివ్ గా షూట్ చేస్తారా? అన్నది చూడాలి.
సందీప్ రెడ్డి టేకింగ్ కు ఇంప్రెస్ అయిన ప్రభాస్ కూడా ఇలాంటి సాహసోపేతమైన పాత్రలో కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు. డార్లింగ్ ను ఇలా చూడటానికి కొందరు ప్రేక్షకులు ఉత్సాహంగా ఉండగా, మరికొందరు బాడీ డబుల్స్ లేదా డిజిటల్ ఎఫెక్ట్స్ ఉపయోగించవచ్చని నమ్ముతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు గానీ, ప్రభాస్ గానీ అధికారికంగా ధృవీకరించలేదు.
స్పిరిట్ గురించి
'స్పిరిట్ చిత్రం ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించబోతోంది. ఇందులో ఆయన ఒక మాఫియా సిండికేట్‌ను ఎదుర్కొనే కోపంతో, నిర్భయంగా ఉండే పోలీసు అధికారిగా కనిపిస్తారు. మొదట దీపికా పదుకొణె కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. విభేదాల కారణంగా ఆమె తప్పుకోవడంతో, తృప్తి డిమ్రిని తీసుకున్నారు. ఈ చిత్రంతో ఆమె తెలుగు సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు.

E-Paper












