ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌‌లో కొరియా విలన్.. వైరల్ అవుతున్న అక్కడి మీడియా రిపోర్ట్..

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీలో కొరియన్ విలన్ ఉండబోతున్నాడు. ట్రైన్ టు బూసాన్ లాంటి సినిమా ఫేమ్ అయిన డాన్ లీ ఈ మూవీలో విలన్ అంటూ అక్కడి మీడియా రిపోర్టు చేయడం ఆసక్తి రేపుతోంది.

Published on: Oct 29, 2025, 10:41:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పాపులర్ కొరియన్ మూవీ 'ట్రైన్ టు బుసాన్', మార్వెల్ మూవీ 'ఎటర్నల్స్' వంటి వాటిలో నటించి అంతర్జాతీయ ప్రేక్షకులకు దగ్గరైన కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ. ఇప్పుడతడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా మన ప్రభాస్ సినిమాతో కావడం విశేసం. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సందీప్ రెడ్డి వంగా మూవీ ‘స్పిరిట్’లో డాన్ లీ విలన్ పాత్ర పోషించనున్నట్లు కొరియా మీడియా రిపోర్ట్ చేసింది.

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌‌లో కొరియా విలన్.. వైరల్ అవుతున్న అక్కడి మీడియా రిపోర్ట్..
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌‌లో కొరియా విలన్.. వైరల్ అవుతున్న అక్కడి మీడియా రిపోర్ట్..

'స్పిరిట్'లో డాన్ లీ విలన్ పాత్ర?

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ నుంచి ఈ మధ్యే ఓ చిన్న గ్లింప్స్ రూపంలో అప్డేట్ వచ్చిన విషయం తెలుసు కదా. వెంటనే ఈ మూవీలో విలన్ పాత్ర అంటూ కొరియన్ మీడియా రిపోర్ట్ చేయడం విశేషం. కొరియన్ డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ కమ్యూనిటీ అయిన ముకో (Muko) మంగళవారం (అక్టోబర్ 28) పోస్ట్ చేస్తూ.. డాన్ లీ ఇండియన్ సినిమా ఎంట్రీ ఖరారైందని పేర్కొంది.

కొరియన్ టెక్స్ట్ లో ఉన్న ఆ టెక్ట్స్ ఇలా ఉంది.. "ఈ చిత్రానికి 'స్పిరిట్' అని పేరు పెట్టారు. దీనికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో బాహుబలి ద్వారా ప్రసిద్ధి చెందిన ప్రభాస్ ఒక డార్క్-టోన్డ్ డిటెక్టివ్ క్రైమ్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మా డాంగ్-సియోక్ (Ma Dong Seok) పాత్ర ప్రభాస్ పోషించిన పాత్రకు వ్యతిరేకంగా నిలబడే పాత్ర అని మాత్రమే తెలిసింది" అని ఉండటం విశేషం.

డాన్ లీ ఇండియా టూర్

ఈ స్పిరిట్ సినిమా కోసం డాన్ లీ ఇటీవల ఇండియా పర్యటనకు సంబంధించిన పోస్ట్‌లు చేశారని నివేదిక పేర్కొంది. "ఇటీవల మన డాంగ్-సియోక్ ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో భారతదేశానికి వెళ్తున్న విమానం ఎక్కుతున్నట్లు పోస్ట్ చేశాడు. అది ఈ చిత్రం కోసమే అని తేలింది" అని ఆ నోట్‌లో ఉంది.

సందీప్ రెడ్డి వంగా ఇటీవలి కాలంలో 'అత్యంత వివాదాస్పద కమర్షియల్ డైరెక్టర్లలో' ఒకరిగా గుర్తింపు పొందారని చెబుతూ.. ‘యానిమల్’, 'అర్జున్ రెడ్డి' వంటి సినిమాల విజయాన్ని కూడా ఈ రిపోర్టు ప్రస్తావించింది. మా డాన్ లీ నటిస్తున్నా కూడా ఈ చిత్రం కొరియాలో విడుదల అవుతుందా లేదా అనేది ఇంకా ధృవీకరించలేదని కూడా ఆ రిపోర్టు తెలిపింది. అయితే సినిమాలో డాన్ లీ నటిస్తున్నట్లుగా చిత్ర బృందం మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.

'స్పిరిట్' మూవీ గురించి..

‘స్పిరిట్’ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఉన్న ఒక పోలీస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమా 'సౌండ్ స్టోరీ'ని పంచుకున్నాడు. ఈ ఆడియో టీజర్ ప్రభాస్ వాయిస్ ద్వారా 'స్పిరిట్' ప్రపంచాన్ని పరిచయం చేసింది. కానీ కథాంశం గురించి పెద్దగా వెల్లడించలేదు. ఈ చిత్రం 2026లో థియేటర్లలో విడుదల కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More