అనుష్క ఎథెరియల్ బ్యూటీ అన్న రాజమౌళి.. అవును ఆమె కళ్లలో ఏదో ఉందని ప్రభాస్ కామెంట్..బాహుబలి టీమ్ రీ యూనియన్.. వీడియో వైరల్
బాహుబలి ది ఎపిక్ మూవీ రిలీజ్ దగ్గర పడింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో అనుష్క గురించి రాజమౌళి, ప్రభాస్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
బాహుబలి సినిమాలు ఎంతటి సంచలనం నమోదు చేశాయో తెలిసింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేశాయి ఈ చిత్రాలు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా బాహుబలి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు.
బాహుబలి ది ఎపిక్
బాహుబలి ది ఎపిక్ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.3 కోట్లకు పైగా అడ్వాన్స్ టికెట్ల సేల్స్ జరిగిందంటే ఈ మూవీపై ఉన్న ఇంట్రెస్ట్ అర్థం చేసుకోవచ్చు. బాహుబలి 1, బాహుబలి 2 కలిసి బాహుబలి ఎపిక్ గా రాబోతుంది.
అనుష్క ఎథెరియల్ బ్యూటీ
థియేటర్లలో బాహుబలి: ది ఎపిక్ పేరుతో రెండు భాగాల సాగా గ్రాండ్ రీ-రిలీజ్ కు ముందు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. నటులు ప్రభాస్, రానా దగ్గుబాటితో చిట్ చాట్ చేశారు. ఇందులో షూట్, అనేక ఐకానిక్ సన్నివేశాలతో పాటు ఎన్నో విషయాలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అనుష్క గురించి రాజమౌళి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఆమెను ఎథెరియల్ బ్యూటీ (దైవిక అందం)గా అభివర్ణించాడు.
ఆమె కళ్లలో
రాజమౌళి ప్రత్యేకంగా మొదటి సినిమాలోని ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తూ.. "అనుష్క మహీష్మతిలోకి ప్రవేశించినప్పుడు ఆమె ఒక అద్భుతమైన దైవిక అందం (ఎథెరియల్ బ్యూటీ)గా కనిపించింది. ఆమె స్కేల్ ఎలా స్టన్ చేయగలిగింది’’ అని రాజమౌళి అన్నాడు. ప్రభాస్ ఒప్పుకుంటూ.. "ఆమె అక్కడ అద్భుతంగా ఉంది. ఆమె కళ్ళలో ఏదో ఉంది. లేకపోతే బాహుబలి కాదు!’’ అని అన్నాడు. ఈ క్లిప్ ను మూవీ ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.
బాహుబలి చిత్ర సిరీస్ లో అమరేంద్ర బాహుబలి భార్య, శివుడు తల్లిగా దేవసేన పాత్రలో అనుష్క నటించింది. కుంతల రాజ్యానికి చెందిన యువరాణి పాత్రను పోషించినందుకు ఆమె ప్రసిద్ది చెందింది.
బాహుబలి గురించి
బాహుబలి ది ఎపిక్ అనేది రెండు భాగాల బాహుబలి కథ. మాహిష్మతి కల్పిత రాజ్యంలో సెట్ చేసిన కథ. ప్రభాస్ ఏమో అమరేంద్ర బాహుబలి, అతని కుమారుడు మహేంద్ర పాత్రలో నటించారు. రానా దగ్గుబాటి ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా భల్లాలదేవగా నటించాడు. వి.విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ సినిమా స్కేల్, విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రశంసలు అందుకుంది. 'బాహుబలి: ది ఎపిక్' అక్టోబర్ 31న విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

E-Paper












