ప్రభాస్-హను రాఘవపూడి మూవీ టైటిల్ ఇదే.. అదిరిపోయిన లుక్.. ఒంటరిగా పోరాడే బెటాలియన్

ప్రచారమే నిజమైంది. ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫౌజీ పేరునే టైటిల్ గా పెట్టారు. ఇవాళ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ప్రకటించారు. 

Oct 23, 2025, 11:16:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. ప్రభాస్- హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ‘ఫౌజీ’ అనే టైటిల్ పెట్టారు. ప్రచారంలోనే ఉన్న పేరునే ఫిక్స్ చేశారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇవాళ (అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టైటిల్ ప్రకటించారు.

ఫౌజీ పోస్టర్ (x/FauziTheMovie)
ఫౌజీ పోస్టర్ (x/FauziTheMovie)

పోస్టర్ తో రివీల్

వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే సీతారామం లాంటి హార్ట్ టచింగ్ బ్లాక్ బస్టర్ అందించిన హను రాఘవపూడితో జత కట్టాడు. వీళ్ల కాంబినేషన్లో లవ్ స్టోరీ రావొచ్చనే టాక్ వినిపించింది. కానీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నట్లు హను గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను పోస్టర్ తో రివీల్ చేశారు.

ఫౌజీ పేరునే

ప్రభాస్- హను రాఘవపూడి మూవీ అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి వర్కింగ్ టైటిల్ గా ఫౌజీ పేరు ప్రచారంలో ఉంది. వీళ్ల మూవీ గురించి ఏ టాక్ ఇచ్చినా ఫౌజీ అనే పేరే వినిపించింది. ఇప్పుడు అదే టైటిల్ ను కన్ఫామ్ చేశారు మేకర్స్. గురువారం (అక్టోబర్ 23) ఉదయం 11.07 గంటలకు ఫౌజీ టైటిల్ తో పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ప్రభాస్ లుక్

ఫౌజీ టైటిల్ పోస్టర్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. కాలిపోతున్న ఇంగ్లీష్ జెండాల వెనుకాల నుంచి సీరియస్ లుక్ లో చూస్తున్నాడు ప్రభాస్. దీనిపై ఒంటరిగా పోరాడే బెటాలియన్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్ తెగ వైరల్ గా మారింది.

పద్మవ్యూహాన్ని జయించిన

‘‘పద్మవ్యూహ విజయీ పార్థః

పాండవపక్షే సంస్థిత కర్ణః ।

గురువిరహితః ఏకలవ్యః

జన్మనైవ చ యుద్ధా ఏషః॥’’

అనే శ్లోకంతో టైటిల్ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. అంటే పద్మ వ్యూహాన్ని జయించిన అర్జునుడు, పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడు, గురువు లేని ఏకలవ్యుడు అనే అర్థం వస్తుంది. మన చరిత్రలో దాగిన ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది అని పోస్టులో పేర్కొన్నారు.

పీరియాడికల్ యాక్షన్

ఫౌజీ మూవీని పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. 1930ల్లో జరిగే కథ ఇది అని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తాడు. తమ దేశ ప్రజలకు న్యాయాన్ని, స్వతంత్రాన్ని, స్వేచ్ఛను అందించేందుకు యోధుడు చేసే పోరాటమే ఈ మూవీ అని టాక్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More