హీరో విక్రమ్ కొడుకు ధృవ్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్- కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ రస్టిక్‌గా బైసన్ ట్రైలర్ రిలీజ్
చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బైసన్. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ చేసింది. తాజాగా బైసన్ టైలర్ రిలీజ్ అయింది. రా అండ్ రస్టిక్‌గా ఇంట్రెస్టింగ్‌గా బైసన్ ట్రైలర్ సాగింది.
స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగు నాట ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. చియాన్ విక్రమ్ నట వారసుడుగా ఆయన కుమారుడు ధృవ్ హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ధృవ్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం బైసన్.

ఇద్దరు హీరోయిన్లు
అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్స్‌పై బైసన్ సినిమాను రూపొందించారు. ఈ మూవీకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. బైసన్ సినిమాలో ధృవ్‌కు జోడీగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసింది. మరో హీరోయిన్ రజీషా విజయన్ కీలక పాత్ర పోషించింది.
కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో బైసన్
అక్టోబర్ 24న తెలుగు రాష్ట్రాల్లో బైసన్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా (అక్టోబర్ 13) సోమవారం రాత్రి 9 గంటల సమయంలో బైసన్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రా అండ్ రస్టిక్ సీన్లతో బైసన్ సినిమాను కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. సినిమా అంతా కబడ్డీ చుట్టు సాగుతుంది.
బిగినింగ్ టు ఎండింగ్ వరకు
ఓ గ్రామంలో కబడ్డీ, రాజకీయ పరమైన అంశాలు, హత్యలు, కుటుంబాల ఎమోషన్ వంటి అన్ని రకాల ఎలిమెంట్స్‌తో పక్కా రస్టిక్‌గా తెరకెక్కించారు. ట్రైలర్‌లో ఫస్ట్ షాట్ బర్రె పుర్రెను చూపించడం, చివరిలో అదే పుర్రెను హీరో తండ్రి నీళ్లలో పడేయడం వంటి సీన్స్ బిగినింగ్, ఎండింగ్ బాగా ఆకట్టుకున్నాయి.
ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్
బైసన్ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌తో లవ్ ట్రాక్, కబడ్డీ ప్లేయర్ కోసం హీరో పడే కష్టం, దాన్ని వద్దని చెప్పే తండ్రి, ఓ పొలిటిషియన్, హత్యలు, హింస ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా బైసన్ ట్రైలర్ సాగింది.
నెక్ట్స్ లెవెల్ బీజీఎమ్
కబడ్డీ వద్దని చెప్పే తండ్రి చివరిలో చేయికి కట్టు ఉన్న హీరో పుషప్స్ చేసేటప్పుడు పక్కనే ఉండే సీన్ హైలెట్‌గా ఉంది. ఇక బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. చాలా డ్రామాటిక్‌గా ప్రారంభమైన బైసన్ ట్రైలర్ చివరి వరకు డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ఈ సినిమా అంతా 1990 కాలం నాటి పరిస్థితుల చుట్టు సాగుతుందని తెలుస్తోంది.
బైసన్ నటీనటులు
ఇదిలా ఉంటే, డైరకెక్టర్ పా రంజిత్ సమర్పణలో బైసన్ సినిమాను రూపొందించారు. ఈ మూవీలో ధృవ్, అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్‌తోపాటు లాల్, పశుపతి, హరి కృష్ణన్, అళగమ్ పెరుమాల్, అరువి మదానంద్, కళైయారసన్ తదితరులు నటించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


