రాజమౌళి మళ్లీ కాపీ కొట్టాడా? ఎస్ఎస్ఎంబీ29లో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ లుక్‌ను సూర్య ఆత్రేయతో పోలుస్తూ పోస్టులు
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ29 నుంచి తొలి అప్డేట్ వచ్చిన విషయం తెలుసు కదా. ఇందులో విలన్ పృథ్వీరాజ్ సుకుమార్ పోషిస్తున్న కుంభ ఫస్ట్ లుక్ పై అప్పుడే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
రాజమౌళి ఏ సినిమా చేయబోతున్నా.. అతడు రిలీజ్ చేసే ప్రమోషనల్ కంటెంట్ నుంచే కాపీ ఆరోపణలు మొదలవుతాయి. తాజాగా మహేష్ బాబుతో వస్తున్న ఎస్ఎస్ఎంబీ29 మూవీ నుంచి అతడు రిలీజ్ చేసిన విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ లుక్ ను చాలా మంది ఫ్యాన్స్ గతంలో వచ్చిన రెండు సినిమాల్లోని లుక్స్ తో పోలుస్తూ పోస్టులు చేస్తున్నారు.

కుంభ లుక్ ఆత్రేయ లుక్‌లా..
గ్లోబ్‌ట్రాటర్ (#Globetrotter)గా పిలుస్తున్న రాజమౌళి, మహేష్ బాబు మూవీ నుంచి విలన్ రోల్ అయిన కుంభ లుక్ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ కుంభ పాత్రలో నటిస్తున్నాడు. అతడు వీల్ చెయిర్ లో ఉన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే ఈ లుక్ చూడగానే ఫ్యాన్స్ చాలా మంది 24 మూవీలో సూర్య చేసిన ఆత్రేయ పాత్రతో పోల్చారు. ఆ సినిమాలోనూ సూర్య ఇలా వీల్ చెయిర్‌కే పరిమితమై అద్భుతమైన విలనీని పోషించాడు. అంతేకాదు బాలీవుడ్ మూవీలో క్రిష్ 3లో వివేక్ ఓబెరాయ్ పోషించిన కాల్ పాత్రతోనూ కొందరు పోల్చారు.
వీల్ చెయిర్ లో విలన్ అనే ఈ కాన్సెప్ట్ ఎంతో ఆసక్తి రేపినా.. రాజమౌళి మరోసారి కాపీ కొట్టాడా అన్న ఆరోపణలూ వస్తున్నాయి. జక్కన్న తన సినిమాల్లో చాలా వరకు హాలీవుడ్ తోపాటు పలు ఇతర సినిమా ఇండస్ట్రీల నుంచి కాపీ కొట్టిన సీన్లను ఉపయోగిస్తాడన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్న ఈ గ్లోబ్‌ట్రాటర్ నుంచి వచ్చిన తొలి అప్డేట్ తోనే మళ్లీ ఈ చర్చ మొదలైంది.
కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ ఎస్ఎస్ఎంబీ29 మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా అతని లుక్ ఉంది. అతడు కుంభ పాత్రలో నటిస్తున్నాడు. ఈ లుక్ ను రాజమౌళితోపాటు మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, సుకుమారన్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"ఈ దుష్ట, క్రూరమైన శక్తిమంతమైన విరోధి కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉంది. తన కుర్చీలో (పాత్రలో) పూర్తిగా ఒదిగిపోయినందుకు పృథ్వీకి కృతజ్ఞతలు" అని రాజమౌళి రాసుకొచ్చాడు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ నటనపై రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. ఇదే పోస్ట్‌లో "పృథ్వీతో మొదటి షాట్ చేసిన తర్వాత నేను అతని దగ్గరికి వెళ్లి మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో ఒకరు అని చెప్పాను" అని రాజమౌళి తెలిపాడు.
ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ వెనుక ఓ ఆర్మీ, ఆఫ్రికన్ అడవుల్లో ఉండే వాటర్ ప్లాంట్స్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. అయితే వీల్ చైర్‌కు రొబోటిక్ హ్యాండ్స్‌తో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్న లుక్ కాస్తా స్పైడర్ మ్యాన్ 2 సినిమాలో డాక్టర్ ఆక్టోపస్ లుక్ తరహాలో కూడా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


