మహేష్ బాబు గురించి మరదలు శిల్పా ఇంట్రెస్టింగ్ కామెంట్లు.. అతికొద్ది మందిలో ఒకరు.. అసూయ, ద్వేషం తెలియదు.. సినిమాలో ఛాన్స్
బావ మహేష్ బాబుపై మరదలు శిల్పా శిరోద్కర్ ప్రశంసల వర్షం కురిపించింది. తన కొత్త సినిమా 'జటాధర' ప్రమోషన్స్‌లో భాగంగా మహేష్ వ్యక్తిత్వం గురించి శిల్ప చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
నటి శిల్పా శిరోద్కర్ చాలా కాలం తర్వాత 'జటాధర' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లోనటించిన ఈ మైథలాజికల్ హారర్ సినిమా ప్రమోషన్స్‌తో ఆమె బిజీగా ఉన్నారు. ప్రేమతో జరిపిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన బావ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ కు శిల్పా సోదరి.

మహేష్ గురించి మరదలు
మహేష్ బాబుకు అసూయ తెలియదని శిల్పా శిరోద్కర్ అన్నారు. ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి శిల్పను అడగ్గా, తాను ఆయనకు పెద్ద అభిమానినని చెప్పారు. “ఆయన నా కుటుంబ సభ్యుడు. నేను కలిసిన అత్యంత దయగల వ్యక్తులలో ఆయన ఒకరు. నేను మహేష్‌కు అభిమానిని. ఆయన నా బావ. నిజం చెప్పాలంటే, ఆయన అందరికీ మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. ఆయనలో ఎలాంటి చెడు ఉద్దేశం, అసూయ, ద్వేషం ఉండవు’’ అని శిల్పా శిరోద్కర్ చెప్పారు.
సినిమా ఛాన్స్
మహేష్ బయటకు ఎలా కనిపిస్తారో, లోపల కూడా అచ్చం అలాగే ఉంటారు. నిజానికి టాలీవుడ్‌లో ఇతర చిత్ర పరిశ్రమల సినిమాలను చూసి వాటిపై సోషల్ మీడియాలో ప్రశంసలు పంచుకునే అతి కొద్ది మంది నటులలో మహేష్ ఒకరు. మహేష్ తో సినిమాలో ఛాన్స్ కోసం ప్రయత్నించలేదు. బహుశా ఈ సినిమా (జటాధర) మంచి విజయం సాధిస్తే.. నేను ఆయన్ని దీని గురించి అడుగుతా’’ అని శిల్పా తెలిపారు.
శిల్పా కెరీర్..
2000 సంవత్సరంలో వచ్చిన ఎం.ఎఫ్. హుస్సేన్ చిత్రం 'గజ గామిని'తో డెబ్యూ చేశారు శిల్పా. అపరేష్ రంజిత్‌తో వివాహం తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. వారికి ఒక కుమార్తె ఉంది. ఆ తర్వాత ఆమె 'ఏక్ ముఠ్ఠీ ఆస్మాన్', 'సిల్సిలా ప్యార్ కా', 'సావిత్రి దేవి కాలేజ్ & హాస్పిటల్' వంటి టెలివిజన్ షోలలో నటించారు. 2020లో వచ్చిన హిందీ చిత్రం 'గన్స్ ఆఫ్ బనారస్'తో ఆమె ఒకరకంగా పునరాగమనం చేశారు. ఇప్పుడు మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న జటాధరతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు శిల్పా.
మహేష్ బాబు చివరిసారిగా 2024 ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు కారం'లో కనిపించారు. ప్రస్తుతం ఆయన ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి ఒక యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా SSMB 29 అని పేరు పెట్టారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


