రాజమౌళి-మహేష్ మూవీ లాంఛ్ ఈవెంట్.. డేట్ ఫిక్స్.. ఓటీటీలో గ్లోబల్ లైవ్ స్ట్రీమింగ్!

ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 (వర్కింగ్ టైటిల్) మూవీకి సంబంధించిన అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా లాంఛ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయిందని, ఈ కార్యక్రమాన్ని ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిసింది.

Published on: Nov 2, 2025, 19:00:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ 29’ స్టార్ కాస్ట్‌పై సరదాగా ఒక అప్‌డేట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. దర్శకుడు తన మాట నిలబెట్టుకోవాలని కోరుతూ మహేష్ బాబు శనివారం రాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎక్స్ లో వీళ్ల కామెంట్లతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ కావడం వైరల్ గా మారింది.

ఎస్ఎస్ఎంబీ29 లాంఛ్ ఈవెంట్ (X @IamB_Lal)
ఎస్ఎస్ఎంబీ29 లాంఛ్ ఈవెంట్ (X @IamB_Lal)

ఎస్ఎస్ఎంబీ 29 లాంఛ్ ఈవెంట్

ఎక్స్ లో రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్లు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఎంబీ 29 లాంఛ్ డేట్ పై క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మూవీ లాంఛ్ ఈవెంట్ ను నవంబర్ 15న నిర్వహించనున్నారని ఓటీటీప్లే రిపోర్ట్ లో తెలిపింది. గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఈవెంట్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తారని చెప్పింది.

ఓటీటీలో స్ట్రీమింగ్

సాధారణంగా మూవీ లాంఛ్ ఈవెంట్లను యూట్యూబ్ లో, టీవీ ఛానెల్స్ లో స్ట్రీమింగ్ చేస్తుంటారు. కానీ రాజమౌళి మూవీ అంటే స్పెషాలిటీ ఉండాలి కదా. అందుకే ఎస్ఎస్ఎంబీ 29 సినిమా లాంఛ్ ఈవెంట్ ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలిసింది. జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ కానుందని టాక్.

తెలుగులో ఫస్ట్ టైమ్

మూవీ లాంఛ్ ఈవెంట్ ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతుండటం ఇదే ఫస్ట్ టైమ్. ఎస్ఎస్ఎంబీ 29 మూవీ టీజర్ తో పాటు టైటిల్ ను ఈ ఈవెంట్ లో రిలీజ్ చేసే అవకాశముంది. ఈ కార్యక్రామాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం హైలైట్ గా నిలవబోతోంది.

ఎస్ఎస్ఎంబీ 29 గురించి..

ఎస్ఎస్ఎంబీ 29 ఒక గ్లోబ్-ట్రాటింగ్ జంగిల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో మహేష్ బాబు ప్రముఖ సాహసికుడు ఇండియానా జోన్స్ లాగా ఒక రగ్గడ్ ఎక్స్‌ప్లోరర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో, కెన్యా అడవులలో కూడా చిత్రీకరించారు. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం 2027లో రిలీజ్ కానుందని తెలిసింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఐఎండీబీ వివరణ ప్రకారం.. “హనుమంతుని లక్షణాలు ఉన్న ఒక పురావస్తు శాస్త్రవేత్త అమెజాన్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల పచ్చని అడవులలో గ్లోబ్ ట్రాటింగ్ సాహసయాత్రకు బయలుదేరుతాడు. ఇంతకు మించి ఇంకా ఉందని విధి మాత్రమే అతనికి చెబుతుంది’’ అని ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More