హీరోయిన్‌గా మహేష్ బాబు మేనకోడలు.. బర్త్‌డే విషెస్ చెబుతూ తల్లి మంజుల చేసిన పోస్ట్ చూశారా.. జాన్వీ ఎంత అందంగా ఉందో..

మహేష్ బాబు మేనకోడలు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. అతని అక్క, నటి మంజుల కూతురు అయిన జాన్వీ స్వరూప్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా మంజుల ఆమె ఫొటోలను షేర్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో జాన్వీ అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Published on: Oct 29, 2025, 11:39:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహేష్ బాబు మేనకోడలు జాన్వీ తెలుసా? టాలీవుడ్ లో నటిగానూ పేరుగాంచిన మహేష్ అక్క మంజుల కూతురు ఈమె. కొన్నాళ్ల కిందట ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇప్పుడామె సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతోంది. ఈ విషయాన్ని మంజులే వెల్లడించిండి.

హీరోయిన్‌గా మహేష్ బాబు మేనకోడలు.. బర్త్‌డే విషెస్ చెబుతూ తల్లి మంజుల చేసిన పోస్ట్ చూశారా.. జాన్వీ ఎంత అందంగా ఉందో..
హీరోయిన్‌గా మహేష్ బాబు మేనకోడలు.. బర్త్‌డే విషెస్ చెబుతూ తల్లి మంజుల చేసిన పోస్ట్ చూశారా.. జాన్వీ ఎంత అందంగా ఉందో..

హీరోయిన్‌గా మంజుల కూతరు జాన్వీ

టాలీవుడ్ లోకి మరో నట వారసురాలు వస్తోంది. అది కూడా ఘట్టమనేని వంశం నుంచి కావడం విశేషం. దివంగత సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేన కోడలు, నటి మంజుల కూతురు అయిన జాన్వీ స్వరూప్ తెరంగేట్రం ఖాయమైంది. బుధవారం (అక్టోబర్ 29) ఆమె బర్త్ డే సందర్భంగా మంజుల చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

“నా ముద్దుల కూతురు జాన్వీ స్వరూప్.. బాగా పెద్దదైంది.. తనదైన జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది.. ఆమె తనతోపాటు ఓ ప్రకాశవంతమైన వారసత్వాన్ని వెంట తీసుకొస్తోంది.. ఇప్పుడిక వెలగడం ఆమె వంతు. ఆమె మ్యాజిక్, ఆమె టాలెంట్, ఆమె మనసుపై నాకు నమ్మకం ఉంది. నాకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిని ప్రపంచం చూడటానికి సిద్ధంగా ఉంది. నా డార్లింగ్.. నీ కోసం స్క్రీన్, ఈ ప్రపంచం వేచి చూస్తోంది. ఐ లవ్యూ సో మచ్.. హ్యాపీ బర్త్ డే మై జాను” అనే క్యాప్షన్ తో ఇన్‌స్టాలో మంజుల పోస్ట్ చేసింది.

ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా..

మంజుల చేసిన ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది. మీ అమ్మాయి అచ్చూ హీరోయిన్ లా ఉందంటూ కొందరు అభిమానులు కామెంట్ చేశారు. ఆమె చాలా అందంగా ఉందని, స్క్రీన్ పై చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నామని ఓ అభిమాని అన్నారు. హ్యాపీ బర్త్ డే జాన్వీ అంటూ ఎంతో మంది ఆమెకు విషెస్ చెప్పారు. వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతూ మంజుల మరోసారి కామెంట్స్ సెక్షన్ లో స్పందించింది.

54 ఏళ్ల వయసున్న మంజు సూపర్ స్టార్ కృష్ణ కూతురు. రమేష్ బాబు, మహేష్ బాబు ఆమె సోదరులు. సంజయ్ స్వరూప్ ను ఆమె పెళ్లి చేసుకుంది. కావ్యాస్ డైరీ, సేవకుడు, మళ్లీ మొదలైంది, హంట్ లాంటి సినిమాల్లో నటించింది. చివరిగా 2023లో వచ్చిన మంత్ ఆఫ్ మధు సినిమాలో కనిపించింది. 2018లో వచ్చిన మనసుకు నచ్చింది అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More