మై బ్రదర్ వెంకీ.. మై బాస్ చిరు సర్.. మన శంకర వర ప్రసాద్ గారు కోసం చేతులు కలిపిన టాలీవుడ్ సీనియర్ హీరోలు.. వీడియో వైరల్
మై బ్రదర్ వెంకీ.. మై బాస్ చిరు సర్ అంటూ టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేశ్ చేతులు కలిపారు. చిరు నెక్ట్స్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు కోసం ఈ ఇద్దరూ కలిసి పని చేయనుండటం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ చేతులు కలిపారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి, నయనతార నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీలో వెంకీ స్పెషల్ అప్పియరెన్స్ ఆసక్తి రేపుతోంది. తాజాగా అతడు షూటింగ్ లో చేరిన వీడియోను చిరు తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు.

చిరు, వెంకీ చేతులు కలిపారు
టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాలుగా ఎన్నో హిట్ సినిమాలను అందించిన హీరోలు చిరంజీవి, వెంకటేశ్. ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. అది కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కోసం కావడం విశేషం. కొన్నాళ్ల కిందటి నుంచీ ఈ సినిమాలో వెంకీ ఓ ఎక్స్‌టెండెడ్ క్యామియో రోల్ పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మూవీ టీమ్ అధికారికంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది.
ఓ వీడియో ద్వారా ఈ విషయం తెలపగా.. దానిని మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి ఈ ఇద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారంటూ ఈ వీడియోను తీసుకొచ్చారు. “మా బ్రదర్ విక్టరీ వెంకటేశ్ కు మన శంకర వర ప్రసాద్ గారు ఫ్యామిలీలోకి స్వాగతం. ఈ ఆనందాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి సెలబ్రేట్ చేసుకుందాం” అనే క్యాప్షన్ తో చిరు పంచుకున్నాడు. ఈ వీడియోలో మై బ్రదర్ వెంకీ అని చిరంజీవి అనగా.. మై బాస్ చిరు సర్ అంటూ అతన్ని కౌగిలించుకున్నాడు వెంకటేశ్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మన శంకర వర ప్రసాద్ గారు గురించి..
మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో వస్తున్న మరో మూవీ ఈ మన శంకర వర ప్రసాద్ గారు. ఇప్పటి వరకూ అపజయం ఎరగని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అనిల్.. వచ్చే సంక్రాంతికి మరో మ్యాజిక్ సిద్ధం చేస్తున్నాడు.
ఆ సంక్రాంతికి వస్తున్నాంలో లీడ్ రోల్ పోషించిన వెంకీ మామ.. ఇప్పుడీ మూవీలోనూ అతిథి పాత్రలో కనిపించనుండటంతో వచ్చే సంక్రాంతికి డబుల్ డోసు గ్యారెంటీ. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరు, వెంకీ కాంబినేషన్.. నయనతార అందం ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


