కలిసి దీపావళి జరుపుకున్న చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, నయనతార.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి దీపావళి జరుపుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవితోపాటు నాగార్జున, వెంకటేశ్, నయనతార ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలను చిరు ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సోమవారం (అక్టోబర్ 20) సాయంత్రం జరిగిన దీపావళి వేడుకల్లో టాలీవుడ్ స్టార్లు నాగార్జున, వెంకటేశ్, లేడీ సూపర్ స్టార్ నయనతార సందడి చేశారు. ఈ వేడుకల ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకోగా, ఈ హీరోల మధ్య ఉన్న నిజమైన స్నేహబంధం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

టాలీవుడ్ స్టార్స్ దీపావళి సెలబ్రేషన్స్
టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, నయనతార, నాగార్జున, వెంకటేశ్ కలిసి హైదరాబాద్‌లో దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల తాలూకు ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈసారి చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో అతని కుటుంబ సభ్యులతో పాటు, సినీ పరిశ్రమలోని అత్యంత సన్నిహితులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి షేర్ చేసిన ఒక ఫోటోలో.. అతడు వెంకటేశ్, నాగార్జునలతో కలిసి పోజులిచ్చారు. మరో చిత్రంలో అతడు ఈ ఇద్దరు నటులకు, వారి కుటుంబాలకు దీపావళి సందర్భంగా బహుమతులు అందిస్తూ కనిపించాడు. ఇంకో ఫోటోలో, చిరంజీవి తన మన శంకర వరప్రసాద్ గారు మూవీ సహనటి నయనతారను ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని, ఆమెకు ఒక శంఖాన్ని గిఫ్ట్‌గా ఇస్తుండటం చూడొచ్చు.
ఈ ఫోటోలను పంచుకుంటూ చిరంజీవి ఇలా రాశాడు.. "ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేశ్, నా సహనటి నయనతార వారి కుటుంబాలతో కలిసి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ (దీపావళి) జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మధుర క్షణాలు మన హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. జీవితాన్ని నిజంగా కాంతిమయం చేసే ప్రేమ, నవ్వు, కలిసి ఉండడం ఎంత ముఖ్యమో ఇవి గుర్తు చేస్తాయి" అన్ని అన్నాడు.
అభిమానుల రియాక్షన్ ఇలా..
ఈ స్టార్స్ అంతా కలిసి దీపావళి జరుపుకోవడం చూసి అభిమానులు ఉప్పొంగిపోయారు. ఒకరు కామెంట్ చేస్తూ.. "వావ్.. ఇదే కదా నిజమైన స్నేహం. కొత్తగా వచ్చే నటులు మా అన్నయ్య నుంచి చాలా నేర్చుకోవాలి" అని రాశారు. మరొక అభిమాని స్పందిస్తూ.. "తెలుగు చిత్ర పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడంలో ఈ ముగ్గురు హీరోలదే అతిపెద్ద పాత్ర" అని కితాబిచ్చారు. కొంతమంది అభిమానులు ఈ ఫోటోల్లో ఒకదానిలో.. గోడపై రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లోని సీతారామరాజు ఫోటోను కూడా గమనించారు.
చిరంజీవి రీసెంట్ మూవీస్
చిరంజీవి చివరిగా 2023లో వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలలో కనిపించాడు. అతడు త్వరలో త్రిష కృష్ణన్ తో కలిసి విశ్వంభర అనే సోషియో-ఫాంటసీ చిత్రంలో కనిపించనున్నాడు. నయనతారతో కలిసి చిరంజీవి నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. ఇవే కాకుండా శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి.
ఇక నాగార్జున ఈ సంవత్సరం కుబేర, కూలీ సినిమాలలో నటించాడు. అతడు ఇంకా తన రాబోయే సినిమాలను అనౌన్స్ చేయలేదు. వెంకటేశ్ కూడా తన రాబోయే ప్రాజెక్ట్‌లను ప్రకటించాల్సి ఉంది. అతడు ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంలో చివరిగా కనిపించాడు. నయనతార త్వరలో మలయాళంలో డియర్ స్టూడెంట్స్, పాట్రియాట్, కన్నడలో టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ అలాగే తమిళంలో మూకుటి అమ్మన్ 2, మన్నంగట్టి సిన్స్ 1960, హై, రక్కయీ వంటి పలు చిత్రాలలో నటించనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


