బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దీపావళి జరుపుకున్న సమంత.. పబ్లిగ్గా ఫొటోలు షేర్ చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్
సమంత తన బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ఆ ఫొటోలను ఆమెనే ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ట్రెడిషనల్ డ్రెస్సులో సింపుల్ గా ఉన్న ఆమె.. టపాసులు పేలుస్తు చాలా ఉత్సాహంగా కనిపించింది.
నటి సమంతా రూత్ ప్రభు, ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరుతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'కృతజ్ఞతతో నిండిపోయాను' అని క్యాప్షన్ ఇవ్వడం వారి మధ్య రొమాన్స్‌పై కొత్త చర్చకు తెరలేపింది. తరచూ కలిసి కనిపిస్తున్న ఈ జంట రిలేషన్షిప్ లో ఉందన్న వార్తలను ఈ మధ్యే సమంత మేనేజర్ కొట్టిపారేసినా.. ఆమె మాత్రం పదే పదే హింట్ ఇస్తూనే ఉంది.

రాజ్‌తో సమంత దీపావళి స్పెషల్
సమంత రూత్ ప్రభు, ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నారనే హింట్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె తాజాగా షేర్ చేసిన పోస్ట్‌లో దీపావళి సంబరాలలో రాజ్ తో కలిసి సంతోషంగా నవ్వుతూ కనిపించింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫెస్టివల్ వైబ్స్ ను పంచుతోంది.
సోమవారం (అక్టోబర్ 20) దీపావళి సందర్భంగా సమంత, ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరుతో కలిసి ఉన్న పండగ స్నాప్‌షాట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఓ సాంప్రదాయ ఔట్‌ఫిట్‌లో చాలా అందంగా కనిపించింది సమంత. నీలి రంగు కుర్తా వేసుకున్న రాజ్ పక్కనే కూర్చుని ఈ దీపాల పండుగను జరుపుకుంది.
అంతేకాదు వాళ్ల ఫ్యామిలీతో కలిసి టపాసులు కాల్చిన ఫొటోలను కూడా ఆమె షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె చాలా ఉత్సాహంగా కనిపించింది.
ఈ పోస్ట్ చూసిన అభిమానులు రకరకాలుగా స్పందించారు. ఒక అభిమాని స్పందిస్తూ.. సామ్ నువ్వు, మీ ఫ్యామిలీ అంటే మాకు ఇష్టం అని రాశారు. మరొకరు కామెంట్ చేస్తూ.. నా ప్రియమైన సమంతకు.. నీ కెరీర్, పర్సనల్ లైఫ్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా. సంతోషంగా ఉండు అని అన్నారు.
సమంత, రాజ్ డేటింగ్ రూమర్స్
సమంత, రాజ్ కలిసి ది ఫ్యామిలీ మ్యాన్, సిటడెల్: హనీ బన్నీలాంటి వెబ్ సిరీస్‌లకి పనిచేశారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్యే ఏదో ఉందన్న పుకార్లు మొదలయ్యాయి. ఇద్దరూ ఈ పుకార్లను ఇప్పటివరకు ధృవీకరించలేదు ఖండించనూ లేదు. అయితే తరచుగా కలిసి కనిపిస్తూ ఉండడం వల్లే వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.
అంతేకాదు ఇటీవల వీరు కలిసి ఉండటానికి ప్లాన్ చేస్తున్నారనే రిపోర్ట్స్ కూడా వచ్చాయి. పింక్‌విల్లా ఒక సోర్స్‌ను ఉటంకిస్తూ.. "సమంత, రాజ్ కలిసి మూవ్ ఇన్ కావాలని ఆలోచిస్తున్నారు. దానికోసం ప్రాపర్టీస్ కూడా చూస్తున్నారు. కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు" అని పేర్కొంది.
ఆ సోర్స్ ఇంకా ఏం చెప్పిందంటే.. "సిటడెల్ కోసం కలిసి పనిచేసిన తర్వాత 2022 లో రాజ్ తన భార్య షామిలితో అఫీషియల్‌గా విడాకులు తీసుకుని, సమంతకు దగ్గరయ్యాడు. రాజ్ తన కూతురితో కనిపించాడనే వార్తలు అబద్ధం. అతనికి కూతురు లేదు. అతనితో కనిపించిన చిన్నారి అతని కో-డైరెక్టర్ కృష్ణ డీకే కూతురు" అని వివరించింది.
అయితే ఈ వార్తలపై సమంత మేనేజర్ హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడారు. కేవలం ఒక్క మాటతో దానికి చెక్ పెట్టారు. అవన్నీ పుకార్లు అని తేల్చి చెప్పారు. రాజ్ గతంలో రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా, విశాల్ భరద్వాజ్ వంటి దర్శకులతో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ షామలీ డేని వివాహం చేసుకున్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


