రామ్ డింపుల్స్ అంటే ఇష్టం.. అతని ఎనర్జీ తీసుకుంటా: భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ కామెంట్లు
ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు రామ్ పోతినేని. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. మరోవైపు రామ్, భాగ్యశ్రీ మధ్య ఏదో ఉందనే ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యశ్రీ కామెంట్లు వైరల్ గా మారాయి.
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న జోడీ పేరు.. భాగ్యశ్రీ బోర్సే, రామ్ పోతినేని. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది ఈ జంట. ఓ వైపు సినిమా రిలీజ్ దగ్గర పడుతుండగా, మరోవైపు వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని గురించి భాగ్యశ్రీ చేసిన లేటెస్ట్ కామెంట్లు వైరల్ గా మారాయి.

డింపుల్స్ ఇష్టం
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన అప్ కమింగ్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఈ మూవీ నవంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది టీమ్. ఈ క్రమంలోనే రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కలిసి స్పెషల్ సెట్ లో శ్రీముఖికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలోనే రామ్ డింపుల్స్ అంటే ఇష్టమని భాగ్యశ్రీ తెలిపింది.
స్కిల్ ఏంటీ అంటే?
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేను ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసింది శ్రీముఖి. ఇందులో రామ్ పోతినేని నుంచి ఏ స్కిల్ తీసుకుంటారని శ్రీముఖి అడిగింది. అయితే కాస్త కన్ ఫ్యూజ్ అయిన భాగ్యశ్రీ ఏమో అతని డింపుల్స్ ఇష్టమని చెప్పింది. దీంతో శ్రీముఖి ఇది విన్నారా? అన్నట్లు భాగ్యశ్రీకి రామ్ డింపుల్స్ నచ్చాయంటా అని మళ్లీ చెప్పింది.
ఎనర్జీ తీసుకుంటా
మీకు హెల్ప్ చేసేందుకు అని అతని డ్యాన్సింగ్, ఎనర్జీ అని శ్రీముఖి అంటుంది. అతని ఎనర్జీ తీసుకుంటానని భాగ్యశ్రీ చెప్తుంది. రామ్ ఇంట్రోవర్ట్ హా, ఎక్స్ ట్రోవర్ట్ హా అని శ్రీముఖి అడుగుతుంది. నాకైతే ఎక్స్ ట్రోవర్ట్ అని భాగ్యశ్రీ చెప్పగానే, అయితే సమ్ థింగ్, సమ్ థింగ్ అని శ్రీముఖి అంటుంది. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఉపేంద్ర కీ రోల్
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాలో ఉపేంద్ర కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆయన ఆంధ్ర కింగ్ సూర్య పాత్ర పోషించారు. ఈ సినిమాకు పి.మహేష్ బాబు డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మించారు. వివేక్, మెర్విన్ మ్యూజిక్ అందించారు.
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర, రావు రామేష్, మురళీ శర్మ, సత్య, వీటీవీ గణేష్ తదితరులు నటించారు. వరుస ఫ్లాప్ ల నేపథ్యంలో ఆంధ్ర కింగ్ తాలూకాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు హీరో రామ్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


