రెండు రోజుల ముందే ప్రీమియర్ షోలు.. పెద్ద రిస్కే చేస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా.. అమెరికా ప్రమోషన్లలో రామ్ బిజీబిజీ
రామ్ పోతినేని తన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో పెద్ద రిస్కే చేస్తున్నాడు. అసలు రిలీజ్ కంటే రెండు రోజుల ముందే అమెరికాలో ప్రీమియర్ షోలు వేస్తుండటం విశేషం. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.
ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని తన నెక్ట్స్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో నటించడమే కాదు రామ్ ఓ పాట రాసి, పాడటం విశేషం. అంతేకాదు ఇప్పుడీ సినిమా ప్రమోషన్లను కూడా వినూత్నంగా చేయాలని నిర్ణయించారు.

ఆంధ్రా కింగ్ తాలూకా ప్రీమియర్స్
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. మహేష్ బాబు పీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తొలిసారి రెండు రోజుల ముందే అమెరికాలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అంటే నవంబర్ 26నే ఈ షోలు చూసే వీలు కలగనుంది.
ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సోమవారం (నవంబర్ 3) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి యూఎస్ఏ ఎలక్ట్రిక్ ఎనర్జీని ఫీల్ కానుంది. మనలో ఒకడిగా, మనతో ఒకడిగా ఆంధ్రా కింగ్ తాలూకా కోసం రామ్ పోతినేని అమెరికా వస్తున్నాడు. నవంబర్ 26న ఎర్లీ ప్రీమియర్స్ లో ఎనర్జిటిక్ స్టార్ ను కలుసుకోండి.” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
తొలిసారి రామ్ ఇలా..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన సినిమా ప్రమోషన్ కోసం అమెరికా వెళ్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. నవంబర్ 26న ప్రీమియర్ల కోసం వెళ్లనున్న అతడు.. మళ్లీ నవంబర్ 30న ఇండియాకు తిరిగి వచ్చిన మూవీ రిలీజ్ తర్వాత ప్రమోషన్లలో పాల్గొననున్నాడు. అమెరికాలో ఈ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ డాలస్, అట్లాంటా, వర్జీనియాతోపాటు మరికొన్ని ఎంపిక చేసిన ప్రదేశాల్లో ప్రీమియర్ షోలు వేయనున్నారు.
అయితే రెండు రోజుల ముందే ప్రీమియర్ షోలు అనేది పెద్ద రిస్కే అని చెప్పొచ్చు. అమెరికాలో మూవీ టాక్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఈ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో రామ్ నటించడమే కాదు.. పాట రాసి, పాడాడు కూడా. కెరీర్లో ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్.. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ ఆంధ్రా కింగ్ తాలూకా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


