అదిరిపోయిన రామ్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న చిన్ని గుండెలో సాంగ్.. 1.8 కోట్ల వ్యూస్.. లిరిక్స్ ఇవే
ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి వచ్చిన మరో పాట ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఈ లవ్ మెలోడీ ఇన్ స్టంట్ సెన్సేషన్ గా మారింది. చిన్ని గుండెలో అంటూ సాగుతున్న పాట ఇప్పటికే యూట్యూబ్ లో 1.8 కోట్ల వ్యూస్ రాబట్టింది. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడున్నాయి. మీరూ పాడేయండి.
రామ్ పోతినేని, భాగ్య శ్రీ బోర్సే జంటగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఈ సినిమాలో ఉపేంద్ర కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా రిలీజైన ఆడియో సాంగ్ అదరగొడుతోంది. అక్టోబర్ 31న యూట్యూబ్ లో రిలీజైన ఈ లిరికల్ సాంగ్ ఇప్పటికే రెండు రోజుల్లోనే 1.8 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టింది.

రామ్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ
ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి రిలీజైన ‘చిన్ని గుండెలో’ సాంగ్ లో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని కొంతకాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిన్ని గుండెలో సాంగ్ లో ఇద్దరూ ఎంతో ముద్దుగా కనిపించారు. ఈ సినిమాకు పి.మహేష్ బాబు డైరెక్టర్.
హత్తుకునే లిరిక్స్
లవ్ మెలోడీ చిన్ని గుండెలో సాంగ్ లిరిక్స్ హత్తుకునేలా ఉన్నాయి. ఈ పాటకు కృష్ణ కాంత్ అద్భుతమైన సాహిత్యం అందించారు. మెర్విన్, సత్య యామిని చాలా బాగా పాడారు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకు వివేక్, మెర్విన్ మ్యూజిక్ డైరెక్టర్లు.
లిరిక్స్ ఇవే
రంగు రంగు తారలన్ని
తొంగి తొంగి ఒక్కసారి, చూస్తున్నాయే ఏంటిలా
పైనా లేని వెన్నెలంత
నేల మీదకొచ్చినట్లు నువ్వుంటే చూడవా
మంచు వాన నన్ను ముంచేనంట
వానవిల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంట
ఈ లోకమంతా నిన్ను చూసేనంట
ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోనే దాచుకుంటా
రంగు రంగు తారలన్ని
తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నాయే ఏంటిలా
ఆ పైన లేని వెన్నెలంత
నేల మీద కొచ్చినట్టు నువ్వుంటే చూడవా
చిన్ని గుండెలో అన్నీ ఆశలు
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
ఏ ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతానే నాతో రా ఇలా
చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
నా ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యేనే ఇలా
ఎంతందమో నీ లోకమే
ఎంతైన ఈ హాయి కలనే కదా
నీ రాకనే నాకో కల
కలలేవో నిజమేదో తేల్చేదెలా
ఏ హద్దులు ఆపనే లేని
ప్రేమంటే నీదే కదా
ఓ గుండెలో దాచలేని
ఆ ప్రేమే ఇచ్చింది నువ్వే కదా
చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
ఏ ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతానే నాతో రా ఇలా
చిన్ని గుండెలో అన్ని ఆశలా
ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల
నా ఊహలో ఇలా తేలవే అలా
వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యనే ఇలా
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


