చిరు గ్రేస్, నయనతార కోపం.. ఇప్పటికే 3.4 కోట్ల వ్యూస్.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న మీసాల పిల్ల సాంగ్.. ఇదిగో లిరిక్స్

మీసాల పిల్ల అంటూ మెగాస్టార్ చిరు పాట పాడుతూ, స్టెప్పేస్తే యూట్యూబ్ షేక్ అవుతోంది. చిరంజీవి అంటేనే గ్రేస్ గాడ్. ఆయన అప్ కమింగ్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు మూవీలోని మీసాల పిల్ల సాంగ్ అదరగొడుతోంది.  ఆ సాంగ్ లిరిక్స్ ఇక్కడున్నాయి. మీరూ పాడేయండి. 

Oct 25, 2025, 21:43:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీసాల పిల్ల అంటూ నయనతార వెనకపడుతున్నాడు చిరంజీవి. మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల అదరగొడుతోంది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది ఈ సాంగ్. పాట రిలీజై 11 రోజులవుతోంది. ఇప్పటికే 3.4 కోట్ల వ్యూస్ వచ్చాయి.

మీసాల పిల్ల సాంగ్ లో నయనతార, చిరంజీవి (youtube)
మీసాల పిల్ల సాంగ్ లో నయనతార, చిరంజీవి (youtube)

సంక్రాంతి రిలీజ్

మన శంకర వరప్రసాద్ గారు మూవీలో చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. దీనికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్. మీసాల పిల్ల సాంగ్ ను భాస్కరభట్ల రవి కుమార్ రాశారు. ఈ పాటను అలనాటి దిగ్గజ సింగర్ ఉదిత్ కుమార్ పాడారు. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడున్నాయి.

మీసాల పిల్ల సాంగ్ లిరిక్స్

హే మీసాల పిల్ల..

నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్లా..

మీసాల పిల్ల..

నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్లా

పొద్దున లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల

మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళ

అట్టా కన్నెర్ర జెయ్యలా కారాలే నూరేలా…

ఇట్టా దుమ్మెత్తి పొయ్యలా దూరాలే పెంచేలా

కుందేలుకు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా..

నీ వేషాలు చాల్లే..

నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..

అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల

నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా..

ఓ బాబు నువ్వే ఇంతేనా..

మగజాతి మొత్తం ఇంతేనా..

గుండెల్లో ముల్లు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా..

మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..

వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..

మీసాల పిల్లా..

ఆ ఎదురింటి యెంకట్రావ్ కుళ్లుకు సచ్చుంటాడు

పక్కింటి సుబ్బారావ్ దిష్టేట్టుంటాడు

ఈడు మట్టే కొట్టుకు పోను

వాడు యేట్లో కొట్టుకు పోను…

ఆ ఏడు కొండల వెంకన్నా నా బాధని చూసుంటాడు

శ్రీశైలం మల్లన్నా కరుణించుంటాడు

కనుకే నీతో కట్ అయ్యాను

చాల హ్యాపీ గుంటున్నాను..

నువ్వింత హార్ష్ గా మాటడాలా

హార్ట్ హర్ట్ అయిపోయేలా…

ఏ తప్పు చేయకుండా భూమ్మీద ఎవ్వరైనా ఉంటారా

నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా

హే మీసాల పిల్ల..

నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..

నీ వేషాలు చాల్లే..

నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..

రాజి పడదామంటే రావే మాజీ ఇల్లలా

నువ్వు రోజు పెట్టె నరకంలోకి మళ్ళి దూకాల

అబ్బా పాతవన్ని తొడాల నా అంతు ఏదో చూడాలా

కలకత్తా కాళీమాత నీకు మేనత్త అయ్యేలా

హే మీసాల పిల్ల.. నా మొహం మీద ఇన్ని సార్లు డోరె వెయ్యలా..

హల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా..

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More