ద్రౌపది 2 సాంగ్ వివాదం- పాట పాడిన వెంటనే క్షమాపణలు చెప్పిన సింగర్ చిన్మయి- ట్వీట్ డిలీట్ చేయాలన్న డైరెక్టర్ మోహన్
ద్రౌపది 2’ సినిమాలో ‘ఎం కోనె..’ (నెలరాజె..) సాంగ్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని లేదా ట్వీట్‌ను తొలగించాలని సింగర్ చిన్మయిని చిత్ర దర్శకుడు మోహన్.జి కోరారు. ఎం కోనే సాంగ్ పాడిన చిన్మయి ఆ పాట పాడినందుకు క్షమాపణలు చెప్పడం వివాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..!
నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా తెరకెక్కిన సినిమా ద్రౌపది 2. సోల చక్రవర్తి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

పాపులర్ సింగర్ ఆలాపన
అయితే, ఇటీవల ఈ సినిమా నుంచి ‘ఎం కోనె..(నెలరాజె..)’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను టాలీవుడ్ పాపులర్ సింగర్ చిన్మయి శ్రీపాద ఆలపించారు. అయితే, ఈ పాటను పాడినందుక క్షమాపణలు చెబుతూ సింగర్ చిన్మయి పోస్ట్ పెట్టారు. అందుకు కారణం డైరెక్టర్ మోహన్ అని తెలిపింది చిన్మయి.
ఎం కోనె.. పాటను ఆలపించిన సింగర్ చిన్మయి.. సాంగ్ విడుదలైన కొద్దిసేపటి తర్వాత తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు క్షమాపణ చెప్పారు. రికార్డింగ్ సమయంలో ఈ సినిమా భావజాలం, దాని నేపథ్యం గురించి తాను తెలియకపోవటం వల్ల పాల్గొన్నానని, ప్రాజెక్ట్ గురించి ముందే తెలుసుకుని ఉంటే తాను ఇందులో ఇన్‌వాల్వ్ అయ్యేదాన్ని కాదని ఆమె వెల్లడించారు.
18 ఏళ్ల పరిచయంతోనే
కేవలం సంగీత దర్శకుడు జిబ్రాన్ చెప్పడంతో ఆ పాట పాడినట్లు, అతనితో తనకున్న 18 ఏళ్ల పరిచయంతో ఆ సాంగ్ పాడినట్లు చిన్మయి పేర్కొంది. అలాగే, ఆ సినిమాకు మోహన్ జి డైరెక్టర్ అని తనకు తెలియదని, తెలిసి ఉంట పాడేదాన్ని కాదని చిన్మయి రాసుకొచ్చింది. ఈ ట్వీట్ వైరల్ కావడంతో దర్శకుడు మోహన్ జి రియాక్ట్ అయ్యారు.
ఈ పాటను పాడటానికి తాను పర్సనల్‌గా చిన్మయి అయితే బావుంటుందని ఆమెతో పాడించానని డైరెక్టర్ మోహన్ జి పేర్నొన్నారు. రికార్డింగ్ సమయంలో చిత్ర సంగీత దర్శకుడు జిబ్రాన్ అందుబాటులో లేకపోవటంతో తాను ట్రాక్‌కు సంబంధించిన విషయాలను మాత్రమే వివరించానని, సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని దర్శకుడు తెలియజేశారు.
ఎలాంటి వివరణ తీసుకోకుండా
తనతో కానీ, సంగీత దర్శకుడితో కానీ మాట్లాడకుండా, ఎలాంటి వివరణ తీసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగించిదని డైరెక్టర్ చెప్పారు. దీనిపై చిన్మయి వివరణ ఇవ్వాలని లేదా తన ట్వీట్‌ను తొలగించాలని మోహన్ జి కోరారు.
ఈ సందర్భంగా ఎవరైనా విమర్శలు చేయాలనుకుంటే చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను కాకుండా తనను విమర్శించాలని.. సినిమా మేకింగ్‌లో భాగమైన ఇతరులను విమర్శించటం పిరికితనమని దర్శకుడు మోహన్.జి పేర్కొన్నారు.
ఇంటిపేరులోనే శ్రీపాద
చిన్మయి తన మెసేజ్‌లో పేర్కొన్న వ్యతిరేక భావజాలం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. "చిన్మయి ఇంటిపేరులో శ్రీపాద అని ఉంది. అది ఆమె ఆధ్యాత్మిక భావాన్ని తెలియజేస్తోంది. ఆమె ఏ భావజాల భేదాల గురించి మాట్లాడిందో నాకు స్పష్టంగా అర్థం కాలేదు" అని తెలిపారు.
ఇలా చిన్మయి, డైరెక్టర్ల రియాక్షన్స్‌తో ఎం కోనే సాంగ్ వివాదంగా మారింది. కాగా, డైరెక్టర్ మోహన్ జి ఎక్కువగా యాంటీ దళిత్ సినిమాలే తీస్తారన్న కారణంతో చిన్మయి అలా విమర్శలు చేసినట్లుగా సమాచారం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


