శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నాం, సెన్సార్ వాళ్లు అలా చూస్తారు: దర్శక నిర్మాత ప్రసాద్ కామెంట్స్
తెలుగులో వస్తున్న లేటెస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ మెసేజ్ ఒరియెంటెడ్ మూవీ కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్. ఇటీవల కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్ ట్రైలర్ లాంచ్‌లో దర్శక నిర్మాత ఎన్‌హెచ్ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళ ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్". ఈ చిత్రాన్ని సుమలీల సినిమా బ్యానర్‌పై ఎన్‌హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.

కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్ రిలీజ్ డేట్
అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సందేశాత్మక కథా కథనాలతో రూపొందిన "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాను ఈ నెల 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు.
కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్ ట్రైలర్ రిలీజ్
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం (డిసెంబర్ 03) హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత ఎన్‌హెచ్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బంగారు పాదం సినిమా చేశాను
డైరెక్టర్ ఎన్‌హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ.. "నేను పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో డైరెక్షన్ కోర్స్ చేశాను. గతంలో బంగారు పాదం అనే చిత్రాన్ని రూపొందించాను. ఇప్పుడు కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నా" అని అన్నారు.
ఆ రెండే ఉంటాయి
"మాది బడ్జెట్ వైజ్ చిన్న సినిమా కానీ క్వాలిటీలో కాదు. నా దృష్టిలో మంచి సినిమా, చెడ్డ సినిమా రెండే ఉంటాయి. మా సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్‌గా మూవీ చేశాం. సెన్సార్ వాళ్ల దృష్టి చిన్న సినిమాకు ఒకలా, పెద్ద సినిమాకు ఒకలా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. నాకూ అలాంటి భావనే కలిగింది" అని దర్శకుడు ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు.
ఆ కవిత్వాలు ఉపయోగించాం
"మా చిత్రాన్ని పొయెటిక్‌గా రూపొందించాం. కాళిదాసు మేఘదూతం, జయదేవుడి గీత గోవిందం నుంచి కొన్ని కవిత్వాలు మా సినిమాలో ఉపయోగించాం. మా సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా, మంచి సినిమా చేశారు, క్వాలిటీ మూవీ చేశారనే పేరు మాత్రం తప్పకుండా వస్తుంది" అని డైరెక్టర్ ఎన్‌హెచ్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మంచి క్వాలిటీగా ఉండేలా
ఇదే ఈవెంట్‌లో డీవోపీ శివశంకర వరప్రసాద్ మాట్లాడుతూ.. "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్ సినిమాకు డీవోపీగా వర్క్ చేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. మా డైరెక్టర్ ప్రసాద్ గారు ఎంతో డెడికేషన్‌తో ఈ సినిమాను రూపొందించారు. మాకున్న రిసోర్సెస్‌లో విజువల్‌గా మంచి క్వాలిటీ ఉండేలా సినిమా చేశాం" అని పేర్కొన్నారు.
నాకు గుర్తింపు తీసుకొచ్చే సినిమా
"గతంలో ప్రసాద్ గారి దర్శకత్వంలో బంగారు పాదం సినిమాలో నటించాను. ఆయన డైరెక్షన్‌లో నేను చేస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశాను. నటుడిగా నాకు గుర్తింపు తీసుకొచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా డైరెక్టర్ ప్రసాద్ గారు అందరికీ నచ్చేలా రూపొందించారు" అని యాక్టర్ దినేష్ వెల్లడించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


