పసుపు అంటిన 10 రూపాయల నోటు కోసం వేట- ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రిలీజ్ చేసిన పైసావాలా ట్రైలర్
తెలుగులో లేటెస్ట్‌గా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ పైసావాలా. అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు కీలక పాత్రలు పోషించిన పైసావాలా ట్రైలర్‌ను తాజాగా ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రిలీజ్ చేశారు. పసుపు అంటిన పది రూపాయల నోటు కోసం సాగే వేటలా పైసావాలా ఉంది.
తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు స్టార్ ఇమేజ్ కంటే కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న హీరోలు, కొత్త దర్శకులు కూడా ధైర్యంగా డిఫరెంట్ స్క్రిప్ట్‌లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అలా ఓ డిఫరెంట్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రమే ‘పైసావాలా’.

క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా
పైసావాలా సినిమా టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రలు పోషించారు. పైసావాలా చిత్రానికి కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహించారు.
సంయుక్తంగా నిర్మించి
ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, వీకేఎం మూవీస్ బ్యానర్స్‌పై పైసావాల సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరించారు.
చంద్రబోస్ చేతుల మీదుగా
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా పైసావాలా ట్రైలర్‌ను ప్రముఖ గీత రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 2న తన చేతుల మీదుగా పైసావాలా ట్రైలర్ రిలీజ్ చేసిన చంద్రబోస్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
పసుపు అంటిన పది రూపాయల చుట్టూ
ఇకపోతే పైసావాలా ట్రైలర్ విషయానికొస్తే.. పసుపు అంటిన పది రూపాయల నోటు చుట్టూ సాగుతుంది. ఆ పది రూపాయల నోటు కోసం అందరూ వేట కొనసాగిస్తారు. అది ఒక హవాలా నోటు అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
హవాలా నోటు ఉంది
“హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్ అయింది. ఫోన్, పర్సు మిస్సింగ్.. అందులో హవాలా నోటు ఉంది. ఆ పని నీవల్లే అవుతుంది” అని ఓ గ్యాంగ్.. హీరోకి చెప్పే సీన్‌తో పైసావాలా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.
ఎవరు నిందితులు
పసుపు అంటిన పది రూపాయల నోటు కోసం వేర్వేరు గ్యాంగ్‌లు తలపడటం, హత్యలు, కొత్త కొత్త పాత్రల ఎంట్రీలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతుంది. చివర్లో తొమ్మిది మంది పాత్రలను చూపిస్తూ “వీళ్లలో అసలు నిందితుడు ఎవరు?” అని సస్పెన్స్‌ను పెంచుతూ ట్రైలర్ ముగిసింది.
ఎమోషనల్, క్రైమ్ ఎలిమెంట్స్
పైసావాలా సినిమాలో క్రైమ్, ఎమోషనల్, డ్రామా ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, పైసావాలా సినిమాకు నగేష్ గౌరీష్ సంగీతం అందించారు. అలాగే, గౌతమ్ వాయిలాడ సినిమాటోగ్రఫీ, ఎంజే సూర్య ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
పైసావాలా రిలీజ్ డేట్
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సంగీతం పైసావాలా ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. ఈ థ్రిల్లర్ డ్రామా పైసావాలా డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


