ఓటీటీలోకి ఇవాళ వచ్చిన రొమాంటిక్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్- 7 భాషల్లో స్ట్రీమింగ్- హీరోయిన్ స్టన్నింగ్ యాక్షన్స్ అదుర్స్!
ఓటీటీలోకి ఇవాళ రొమాంటిక్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జిద్దీ ఇష్క్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అదితి పోహంకర్ మెయిన్ లీడ్ రోల్ చేసిన జిద్దీ ఇష్క్ 7 భాషల్లో ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సిరీస్‌లో అదిరిపోయే స్టన్నింగ్ యాక్షన్స్‌తో హీరోయిన్ అదితి ఆకట్టుకుంది. జిద్దీ ఇష్క్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.
ఓటీటీలోకి ప్రతివారం డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అందులోనూ శుక్రవారం నాడు మరిన్ని ఎక్కువగా ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఇవాళ (నవంబర్ 21) 20కిపైగా ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ కాగా అందులో రొమాంటిక్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

జిద్దీ అంటే అర్థం ఇదే
ఆ వెబ్ సిరీసే జిద్దీ ఇష్క్. జిద్దీ అంటే హిందీలో మొండి అని అర్థం వస్తుంది. హిందీలో రొమాంటిక్ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన జిద్దీ ఇష్క్‌లో మెయిన్ లీడ్‌లో బాలీవుడ్ బ్యూటీ అదితి పోహంకర్ నటించింది. లాయి బారి, స్టార్, షీ, ఆశ్రం, మండాల మర్డర్స్ వంటి ఓటీటీ కంటెంట్‌తో తెగ పాపులర్ అయిన బ్యూటీ అదితి పోహంకర్.
జిద్దీ ఇష్క్ నటీనటులు
జిద్దీ ఇష్క్ ఓటీటీ సిరీస్‌లో అదితితోపాటు పరంబ్రత చటోపాధ్యాయ్, సుమీత్ వ్యాస్, బర్ఖా బిష్త్, రియా సేన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ హిందీ వెబ్ సిరీస్‌కు రాజ్ చక్రవర్తి కథ, దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ అంతా బెంగాల్ నేపథ్యంలో సాగుతుంది.
లవర్ సూసైడ్
మెహల్ (అదితి పోహంకర్), శేఖర్ దా (పరంబ్రత చటోపాధ్యాయ్) ఇద్దరు ప్రేమికుల చుట్టూ సాగుతుంది. టీనేజ్ అమ్మాయి అయిన మెహల్, శేఖర్ గాఢంగా ప్రేమించుకుంటారు. శేఖర్‌ను మెహల్ ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తుంది. అయితే, ఓ రోజు శేఖర్ దా సూసైడ్ చేసుకుంటాడు.
యూనికార్న్ కంపెనీలో జాబ్
సూసైడ్ కావడంతో శేఖర్ దా మరణాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ, శేఖర్ దా ఎలాంటి వాడో తెలిసిన మెహల్ తన ప్రేమికుడి చావుకు గల కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే యూనికార్న్ అనే సాఫ్ట్‌వెర్ కంపెనీలో జాబ్‌లో జాయిన్ అవుతుంది.
మెహల్ ప్రతీకారం
ఆ తర్వాత ఏమైంది? యూనికార్న్ ఆఫీస్‌కు శేఖర్ దాకు సంబంధం ఏంటీ? శేఖర్‌ది సూసైడ్ కాదా? అతన్ని ఎవరు చంపారు? ఎందుకు హత్య చేశారు? దాని వెనుక ఎంతమంది ఉన్నారు?, మెహల్ ప్రతీకారం తీర్చుకుందా? అనే విషయాలు తెలియాలంటే మొండి ప్రేమ అయిన జిద్దీ ఇష్క్ చూడాల్సిందే.
స్టన్నింగ్ యాక్షన్స్‌తో
రొమాంటిక్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన జిద్దీ ఇష్క్ సిరీస్‌లో హీరోయిన్ అదితి చేసే యాక్షన్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇదివరకు సిరీస్‌లలో స్టన్నింగ్ యాక్షన్స్‌తో అట్రాక్ట్ చేసిన అదితి పోహంకర్ మరోసారి ఫ్యాన్స్‌ను అలరించేలా జిద్దీ ఇష్క్ ఫైటింగ్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
ఇకపోతే జియో హాట్‌స్టార్‌లో జిద్దీ ఇష్క్ ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి (నవంబర్ 21) హాట్‌స్టార్‌లో హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలి వంటి ఏడు భాషల్లో జిద్దీ ఇష్క్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు జిద్దీ ఇష్క్ ఓటీటీ సిరీస్‌ను ట్రై చేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


