ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సూపర్ హిట్ మూవీ- 5 భాషల్లో స్ట్రీమింగ్- 8.3 రేటింగ్- డీ గ్లామర్ రోల్‌లో అనుపమ పరమేశ్వరన్!

ఓటీటీలోకి ఇవాళ తమిళ సూపర్ హిట్ మూవీ బైసన్ తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన బైసన్ స్పోర్ట్స్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. మారి సెల్వరాజ్ తెరకెక్కినంచిన బైసన్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Nov 21, 2025, 11:56:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి చియాన్ విక్రమ్ నట వారసుడుగా ఆయన కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం బైసన్.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సూపర్ హిట్ మూవీ- 5 భాషల్లో స్ట్రీమింగ్- 8.3 రేటింగ్- డీ గ్లామర్ రోల్‌లో అనుపమ పరమేశ్వరన్!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సూపర్ హిట్ మూవీ- 5 భాషల్లో స్ట్రీమింగ్- 8.3 రేటింగ్- డీ గ్లామర్ రోల్‌లో అనుపమ పరమేశ్వరన్!

డీ గ్లామర్‌గా అనుపమ

ధృవ్ హీరోగా తెరకెక్కిన బైసన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామర్ లుక్‌లో అనుపమ పరమేశ్వరన్ అట్రాక్ట్ చేసింది. అనుపమతోపాటు మరో హీరోయిన్ రజీషా విజయన్ కీలక పాత్ర పోషించింది.

బైసన్ కాలమాదన్ టైటిల్‌తో

అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్స్‌పై బైసన్ చిత్రాన్ని నిర్మించారు. బైసన్ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 17న తమిళనాడులో బైసన్ కాలమాదన్ (Bison Kaalamaadan) టైటిల్‌తో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది.

బైసన్ రేటింగ్

బైసన్ సినిమాపై ప్రశంసలు కురిశాయి. అంతేకాకుండా బైసన్ మూవీకి ఐఎమ్‌డీబీలో పదికి 8.3 రేటింగ్ కూడా ఉంది. అలాంటి బైసన్ ఓటీటీలోకి ఇవాళ (నవంబర్ 21) వచ్చేసింది. అది కూడా ఏకంగా 5 భాషల్లో బైసన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

బైసన్ ఓటీటీ స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి బైసన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి ఐదు భాషల్లో బైసన్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కావాల్సింది. అక్టోబర్ 24న తెలుగు రాష్ట్రాల్లో బైసన్ విడుదల కావాల్సింది.

తెలుగులో లేని థియేట్రికల్ రిలీజ్

కానీ, పలు అనివార్య కారణాల వల్ల తెలుగులో థియేట్రికల్ రిలీజ్ కాలేదు బైసన్ మూవీ. అయితే, ఓటీటీలోకి నేరుగా తెలుగులోనే బైసన్ సినిమాను డిజిటల్ ప్రీమియర్ చేశారు మేకర్స్. ఇక బైసన్ సినిమా అంతా కబడ్డీ ఆట చుట్టూ సాగుతుంది. ఓ గ్రామంలో కబడ్డీ ఆట, దాని చుట్టూ ఉండే రాజకీయం, క్రైమ్ వంటి అంశాలతో బైసన్ తెరకెక్కింది.

రా అండ్ రస్టిక్‌గా

హత్యలు, కుటుంబాల ఎమోషన్ వంటి అన్ని రకాల ఎలిమెంట్స్‌తో పక్కా రా అండ్ రస్టిక్‌గా బైసన్ సినిమాను తెరకెక్కించారు. అయితే, తెలుగులో రిలీజ్ చేసిన బైసన్ ట్రైలర్‌లో ఫస్ట్ షాట్ బర్రె పుర్రెను చూపించడం, చివరిలో అదే పుర్రెను హీరో తండ్రి నీళ్లలో పడేయడం వంటి సీన్స్ బిగినింగ్, ఎండింగ్ బాగా ఆకట్టుకున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

ఇదిలా ఉంటే, బైసన్ సినిమాలో ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్‌తోపాటు లాల్, పశుపతి, హరి కృష్ణన్, అళగమ్ పెరుమాల్, అరువి మదానంద్, కళైయారసన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో మిస్ అయిన బైసన్ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో ఎంచక్కా చూడొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More