నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారన్నారు, నా కొడుకుతో కూడా అలా అనే స్థాయికి వెళ్లాలి.. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ కామెంట్స్

స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బైసన్. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన బైసన్ అక్టోబర్ 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా బైసన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తన తండ్రి విక్రమ్‌లా తాను ఉన్నారని చెప్పిన విషయం గురించి చెప్పాడు ధృవ్ విక్రమ్.

Published on: Oct 22, 2025, 08:54:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బైసన్. ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ ధృవ్‌తో జత కట్టింది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన బైసన్ సినిమా కబడ్డీ నేపథ్యంలో రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కింది. అక్టోబర్ 24న థియేటర్లలో బైసన్ రిలీజ్ కానుంది.

నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారన్నారు, నా కొడుకుతో కూడా అలా అనే స్థాయికి వెళ్లాలి.. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ కామెంట్స్
నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారన్నారు, నా కొడుకుతో కూడా అలా అనే స్థాయికి వెళ్లాలి.. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ కామెంట్స్

ధృవ్ విక్రమ్ కామెంట్స్

ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా (అక్టోబర్ 21) బైసన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొదటిసారి హైదరాబాద్ వచ్చాను

హీరో ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ .. "బైసన్‌ను తెలుగులో ప్రమోట్ చేసేందుకు మొదటి సారిగా హైదరాబాద్ వచ్చాను. అలా నాకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకంగా మారింది. నేను కొన్ని రోజుల క్రితం ఇక్కడికి షాపింగ్ చేసేందుకు వచ్చాను. అక్కడ ఆ షాప్ ఓనర్ నన్ను చూసి ‘మీరు విక్రమ్‌లా ఉన్నారు’ అని అన్నారు" అని తెలిపాడు.

మా నాన్న చేసే ప్రయోగాల గురించి

"అవును.. నేను ఆయన (విక్రమ్) కొడుకుని అని చెప్పాను. మా నాన్న గారి కష్టం, సినిమా కోసం చేసే ప్రయోగాల గురించి చాలా చెప్పారు. ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. కానీ, నేను ఆయన కొడుకుగా నాకు అన్నీ సులభంగానే అందాయి. కానీ ఆయనలా అందరి ప్రేమను సంపాదించేందుకు చాలా కష్టపడతాను" అని ధృవ్ విక్రమ్ చెప్పాడు.

నాకు తెలుగులో నటించాలని ఉంది

"నాకు తెలుగులో నటించాలని ఉంది. ‘బైసన్’ కోసం మూడేళ్లు కష్టపడ్డాను. ఈ మూవీని చూడండి. నచ్చితే సపోర్ట్ చేయండి. నాన్న గారిలానే నేను కూడా చాలా కష్టపడి వంద శాతం ఎఫర్ట్ పెడతాను. నా కొడుకు కూడా ఇలా వస్తే.. ‘మీ నాన్న ధృవ్ అంటే చాలా ఇష్టం’ అని చెప్పే స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను" అని ధృవ్ విక్రమ్ తన కోరిక గురించి వివరించాడు.

అర్జున అవార్డు గ్రహీత కథ ఆధారంగా

"తమిళంలో మా సినిమాకు మంచి ఆదరణ దక్కింది. మారి సెల్వరాజ్ గారు తన జీవితంలో ఎదురైన అనుభవాలు, చూసిన సంఘటనల నుంచే కథల్ని రాసుకుంటారు. పీపుల్స్‌ని ఎడ్యుకేట్ చేయాలని ఆయన పరితపిస్తుంటారు. అర్జున అవార్డు గ్రహీత మణతి గణేషన్ కథ ఆధారంగా ఈ మూవీని మారి సెల్వరాజ్ గారు తెరకెక్కించారు" అని ధృవ్ విక్రమ్ పేర్కొన్నాడు.

కబడ్డీ నేర్చుకున్నాను

"ఈ మూవీ కోసం నేను కబడ్డీ నేర్చుకున్నాను. నంబర్స్ గురించి కాకుండా తెలుగులో మా సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ మా చిత్రం నచ్చుతుంది. అక్టోబర్ 24న అందరూ చూడండి" అని తన స్పీచ్ ముగించాడు హీరో ధృవ్ విక్రమ్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More