నీకు పాన్ మసాలా యాడ్ అవసరమా.. రూ.12 వేల కోట్లకుపైగా సంపద.. వడ్డీయే 500 కోట్లు వస్తుంది: షారుక్‌ను ఏకిపారేసిన ధృవ్ రాఠీ
యూట్యూబర్ ధృవ్ రాఠీ ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ను ఏకిపారేశాడు. ఓ బిలియనీర్‌వి అయినా కూడా.. పాన్ మసాలా యాడ్ నీకు అవసరమా అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యూట్యూబర్ ధ్రువ్ రాఠీ.. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ ఆస్తి, బ్రాండ్ యాడ్స్ గురించి ఒక వీడియో షేర్ చేసి ఆన్‌లైన్‌లో ఒక చర్చను మొదలుపెట్టాడు. బుధవారం (అక్టోబర్ 15) ఎక్స్ లో పెట్టిన ఒక పోస్ట్‌లో.. ఈ 'జవాన్' యాక్టర్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన ఎంటర్‌టైనర్లలో ఒకరని, అతని ఆస్తి సుమారుగా 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12,400 కోట్లు) అని చెబుతున్న రిపోర్ట్‌ల గురించి ధ్రువ్ మాట్లాడాడు.

పాన్ మసాలా యాడ్ అవసరమా?
పాన్ మసాలాను ప్రమోట్ చేయాల్సిన అవసరం షారుక్ కు ఏముంది అని ప్రశ్నించిన ధ్రువ్ రాఠీ ఆ వీడియోలో ఇలా అన్నాడు.. “షారుక్ ఖాన్ ఇప్పుడు ఒక బిలియనీర్ అయిపోయాడు. అతని ఆస్తి 1.4 బిలియన్ డాలర్లకి చేరింది. మన కరెన్సీలో చెప్పాలంటే అది దాదాపు రూ.12,400 కోట్లు. దాన్ని ఊహించుకోవడం కూడా కష్టం” అని రాఠీ అన్నాడు.
ఆ తర్వాత ఆ సంపదపై షారుక్ కి ఎంత వడ్డీ రావచ్చో, అతని ఏడాది ఖర్చు ఎలా ఉండొచ్చో ఊహించాడు. అందులో లగ్జరీ ఇళ్లు, ఒక ప్రైవేట్ జెట్, హాలిడేస్ ఖర్చులు కూడా కలిపి లెక్క వేశాడు. అలాంటి లైఫ్‌స్టైల్ ఉన్నప్పటికీ ఆ యాక్టర్‌కి ఇంకా బోలెడంత డబ్బు మిగిలి ఉంటుందని చెబుతూనే.. షారుక్ ఒక పాన్ మసాలా బ్రాండ్‌ని ప్రమోట్ చేయాలన్న నిర్ణయాన్ని రాఠీ ప్రశ్నించాడు.
“షారుక్ ఖాన్‌కి నా ప్రశ్న ఏంటంటే.. ఇంత డబ్బు సరిపోదా? ఒకవేళ సరిపోతే, పాన్ మసాలా లాంటి హానికరమైన వస్తువును ఇంకా ఎందుకు ప్రమోట్ చేయాల్సిన అవసరం వచ్చింది” అని అడిగాడు. అలాంటి యాడ్స్ కోసం ఆ సూపర్‌స్టార్‌కి దాదాపు రూ.100 నుండి రూ.200 కోట్లు ఇచ్చారని చెబుతున్న రిపోర్ట్‌లను కూడా ధ్రువ్ ప్రస్తావించాడు. వాటివల్ల సమాజంపై పడే ప్రభావం గురించి ఆలోచించుకోమని కోరాడు.
మీకు ఆ డబ్బు అవసరమా?
తన నిర్ణయాల గురించి ఆలోచించుకోమని షారుక్ ను కోరిన ధ్రువ్.. “అసలు ప్రశ్న ఏంటంటే.. మీకు నిజంగా ఈ అదనపు రూ.100–రూ.200 కోట్లు అవసరమా? మీ అంతరాత్మను అడిగి నిజాయితీగా చెప్పండి. అంత డబ్బుతో ఏం చేస్తారు? ఇంకో కోణంలో ఆలోచించండి.. దేశంలోనే టాప్ యాక్టర్ ఇలాంటి హానికరమైన ప్రొడక్టులను ప్రమోట్ చేయడం ఆపేస్తే, దాని ప్రభావం దేశంపై ఎలా ఉంటుంది?" అని కూడా అడిగాడు.
ఈ మెసేజ్‌ని షారుక్ కి చేరేలా అందరూ షేర్ చేయాలని తన ఫాలోవర్స్‌ని కోరుతూ అతను వీడియోను ముగించాడు. షారుక్ ఖాన్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ తీస్తున్న 'కింగ్' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సుహానా ఖాన్, దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సీ కూడా నటిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


