డబ్బు విలువ చెప్పే పైసా పైసా పాట రిలీజ్.. ఆకట్టుకుంటోన్న పైసావాలా మూవీలోని రెండో లిరికల్ సాంగ్!

చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న విడుదలైన పాట పైసా పైసా. అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనాక్షిత, పి. అన్షు పొన్నచన్ మెయిన్ లీడ్ రోల్స్ చేసిన పైసావాలా నుంచి రెండో పాటగా నిన్న పైసా పైసా సాంగ్ రిలీజ్ అయింది. సబరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన పైసా పైసా పాట వివరాలపై లుక్కేద్దాం.

Published on: Nov 15, 2025, 16:52:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనాక్షిత, పి. అన్షు పొన్నచన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ టాలీవుడ్ చిత్రం ‘పైసావాలా’. ఈ పైసావాలా సినిమాకు కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, పైసావాలా మూవీని ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, వీకేఎం మూవీస్ బ్యానర్స్‌పై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి నిర్మిస్తున్నారు.

డబ్బు విలువ చెప్పే పైసా పైసా పాట రిలీజ్.. ఆకట్టుకుంటోన్న పైసావాలా మూవీలోని రెండో లిరికల్ సాంగ్!
డబ్బు విలువ చెప్పే పైసా పైసా పాట రిలీజ్.. ఆకట్టుకుంటోన్న పైసావాలా మూవీలోని రెండో లిరికల్ సాంగ్!

పైసావాల నుంచి రెండో సాంగ్

ఇప్పటికే ఈ పైసావాలా చిత్రం నుంచి ‘ఏమైందిదో గాని ..’ లిరికల్‌ సాంగ్‌ విడుదల అయింది. ఆ ‘ఏమైందిదో గాని ..’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా నిన్న (నవంబర్ 14) ఈ సినిమా పైసావాలా నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు.

పైసా పైసా సాంగ్ రిలీజ్

విశాఖపట్నంలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో పైసావాలా మూవీ రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన పైసావాలా సెకండ్ లిరికల్ సాంగ్ ‘పైసా పైసా’ లాంచ్ కార్యక్రమానికి హీరో అధ్విక్, దర్శకుడు కె. నవీన్ తేజస్, నిర్మాతలు పైడిరాజు, పి.ఎస్.ఎన్. రాజు హాజరయ్యారు.

డబ్బుతో ఎలాంటి అవసరాలు

‘జీవుల మనుగడకు సృష్టించిన పైసా.. జీవం లేకున్నా నిర్జీవిరా పైసా’ అంటూ సాగే ఈ పాటకు నగేశ్ గౌరీష్ సంగీతం అందించారు. కాకి లక్ష్మణ్‌రెడ్డి ఈ పాటను ఎంతో బ్యూటిఫుల్‌గా ఆలపించారు. డబ్బుతో ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలియజేసేలా ఈవీఆర్ అండ్ గురుబిల్లి జగదీష్ ఈ పాటను రచించారు.

పైసావాలా రిలీజ్‌పై

ఇదిలా ఉంటే, గౌతమ్ వాయిలాడ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్న పైసావాలా సినిమాకు ఎంజే సూర్య ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే, పైసావాలా సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు.

పైసావాలా నటీనటులు

ఇకపోతే పైసావాలా సినిమాలో రాజేష్ బెజ్జంకి, పీ శ్రీధర్, సృజనాక్షిత, అన్షు పొన్నచన్‌తోపాటు నూనెల పైడిరాజు, ఎమ్ సంజన, వుకోటి వెంకటేశ్వరావు (నాని), గుడివాడ శ్రీనివాసరావు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

శబరి మ్యూజిక్ ద్వారా

ఇక పైసావాలా సినిమా నుంచి నిన్న రిలీజ్ అయిన పైసా పైసా సాంగ్‌ను శబరి మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా స్పెషల్‌గా రిలీజ్ చేసిన పైసా పైసా పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. లిరిక్స్ ఆకట్టుకునేలా, అర్థవంతంగా, డబ్బు విలువ నేటి కాలంలో ఎలా ఉందో పాటతో చెప్పారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More