సంచారి సాంగ్ లిరిక్స్.. మహేష్ బాబు, రాజమౌళి గ్లోబ్‌ట్రాటర్ నుంచి వచ్చిన పవర్‌ఫుల్ సాంగ్ చూశారా?
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మూవీ నుంచి సంచారి అనే సాంగ్ సోమవారం (నవంబర్ 10) రిలీజైన విషయం తెలిసిందే. ఈ పాట అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ పవర్ ఫుల్ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి.
ఇండియన్ సినిమాలోనే ఇప్పటి వరకూ కనీవినీ ఎరగని రీతిలో, అత్యంత భారీ అంచనాలతో వస్తోంది మహేష్ బాబు, రాజమౌళి సినిమా. ప్రస్తుతం గ్లోబ్ ట్రాటర్ గా పిలుస్తున్న ఈ మూవీ నుంచి బిగ్ రివీల్ ఈ శనివారం (నవంబర్ 15) రానుంది. అయితే సోమవారం (నవంబర్ 10) ఈ మూవీ నుంచి సంచారి అనే సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే.

సంచారి సాంగ్ గురించి..
మహేష్ బాబు, రాజమౌళి మూవీ నుంచి బిగ్ రివీల్ కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్న సమయంలో అనుకోకుండా ఈ సంచారి సాంగ్ వచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ పాటను ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా.. శృతి హాసన్ పాడింది. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించాడు. సంచారి.. సంచారి అంటూ సాగిపోయే పాట మూవీలో లీడ్ రోల్ పాత్రను వర్ణించేలా ఉంది. ఈ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా మారింది.
ఈ పాట ద్వారానే గ్లోబ్ ట్రాటర్ బిగ్ రివీల్ గురించి మేకర్స్ వెల్లడించారు. ఈ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ 15న సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఏం రివీల్ చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 100 అడుగుల అత్యంత భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ఆ రివీల్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ ను జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు.
సంచారి సాంగ్ లిరిక్స్
కాలాన్నే శాసిస్తూ.. ప్రతి రోజూ పరుగే లే..
వేగాన్నే శ్వాసిస్తూ.. పెనుగాలై తిరిగేలే..
ఖండాలే దాటేస్తూ.. ఖగరాజై వాలే..
రారా.. రారా.. ధీరా.. ధృవతారా..
రారా.. స్వైరా.. సంచారా..
సంచారి.. సంచారి..
నినదించే రణభేరి..
సంహారి.. సంహారి..
మృత్యువుపై తన స్వారీ..
సంచారి.. సంచారి..
సాహసమే తన దారి..
సంహారి.. సంహారి..
అసురులపై అసిధారి..
కాలాన్నే శాసిస్తూ..
జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్.. జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్..
జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్.. జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్..
ట్రాటర్..
జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్.. జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్..
జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్.. జీ ఎల్ ఓ బీ ఈ ట్రాటర్..
సంచారి.. సంచారి..
నినదించే రణభేరి..
సంహారి.. సంహారి..
మృత్యువుపై తన స్వారీ..
సంచారి.. సంచారి..
సాహసమే తన దారి..
సంహారి.. సంహారి..
అసురులపై…
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


