ఓటీటీలో మహేష్ బాబు, రాజమౌళి గ్లోబ్‌ట్రాటర్ రివీల్ లైవ్ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీ బిగ్ రివీల్ ఈవెంట్ ఈ శనివారం (నవంబర్ 15) జరగనున్న విషయం తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ ఈవెంట్ ను ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నుంచి ఓ అతిపెద్ది రివీల్ ఈ వీకెండ్ ఉండబోతోంది. దీనికోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 100 అడుగుల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ కూడా రెడీ చేశారు. అంతేకాదు ఈ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియోహాట్‌స్టార్ వెల్లడించింది.

గ్లోబ్‌ట్రాటర్ లైవ్ స్ట్రీమింగ్
రాజమౌళి, మహేష్ బాబు మూవీ నుంచి రాబోతున్న ఆ బిగ్గెస్ట్ రివీల్ ఏంటన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరిగిపోతుంది. మరో నాలుగు రోజుల్లో అదేంటో తేలనుంది. ఇప్పటికే సోమవారం (నవంబర్ 10) అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ సంచారి అనే సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ రివీల్ ఈవెంట్ ను జియోహాట్‌స్టార్ లైవ్ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఆ విషయాన్ని ఈ ఓటీటీ మంగళవారం (నవంబర్ 11) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“లెజెండ్స్ ఒక్కటైనప్పుడు చరిత్ర సృష్టించబడుతుంది. మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్ ట్రాటర్ గ్రాండ్ ట్రైలర్ రివీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నవంబర్ 15న సాయంత్రం 7 గంటల నుంచి కేవలం జియోహాట్‌స్టార్ లో..” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
ఈ సందర్భంగా పోస్ట్ చేసిన వీడియోలో మహేష్, ప్రియాంక, సుకుమారన్ మాట్లాడారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బిగ్ రివీల్ కోసం మాతో జాయిన్ అవండి అని ప్రియాంకా చెప్పింది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఎక్స్‌క్లూజివ్ గా జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని మహేష్ అన్నాడు.
గ్లోబ్ ట్రాటర్ నుంచి సంచారి సాంగ్
ఇక రాజమౌళి, మహేష్ బాబు మూవీ నుంచి సంచారి సాంగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటను శృతి హాసన్ పాడటం విశేషం. ఇక ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించాడు. తన గత సినిమాలు, పాటలకు పూర్తి భిన్నంగా ఈ సంచారి పాటను అతడు కంపోజ్ చేశాడు. అందుకు తగినట్లే లిరిక్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి. చైతన్య ప్రసాద్ ఈ పాట రాశాడు. శృతి హస్కీ వాయిస్ ఈ పాటకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


