బాలకృష్ణ అఖండ 2 నుంచి ఫస్ట్ సింగిల్ తాండవం రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సాంగ్

బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ తాండవం వచ్చేసింది. తమన్ మ్యూజిక్ తో ఈ సాంగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇందులో బాలయ్య లుక్, యాక్షన్ అదిరిపోయింది. సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా నిలిచింది.

Published on: Nov 14, 2025, 18:39:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ 2. ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుంది. తాజాగా శుక్రవారం (నవంబర్ 14) ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ తాండవం రిలీజైంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

బాలకృష్ణ అఖండ 2 నుంచి ఫస్ట్ సింగిల్ తాండవం రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సాంగ్
బాలకృష్ణ అఖండ 2 నుంచి ఫస్ట్ సింగిల్ తాండవం రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సాంగ్

ది తాండవం సాంగ్ రిలీజ్

అఖండ 2 మూవీ నుంచి ది తాండవం అంటూ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. నాలుగు నిమిషాలకుపైగా ఉన్న ఈ లిరికల్ వీడియో బాలయ్య విశ్వరూపంతో అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ముంబైలోని జుహులో మేకర్స్ ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. కల్యాణ్ చక్రవర్తి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

బాలీవుడ్ సింగర్స్ శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ ఈ పాట పాడటం విశేషం. శివుడి తాండవం గురించి పవర్‌ఫుల్ లిరిక్స్ తో ఈ పాట సాగిపోయింది. ఇందులో అఘోరా లుక్ లో బాలయ్య నటవిశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ పాటలోని విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మంచు పర్వతాల్లో షూటింగ్ చేశారు.

అఖండ 2 గురించి..

2021లో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లోనే వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తోంది. సరిగ్గా నాలుగేళ్లకు ఈ సీక్వెల్ రిలీజ్ కానుండటం విశేషం. ఈ సినిమాలో సంయుక్త, హర్షాలీ మల్హోత్రా కూడా నటిస్తున్నారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ ఏడాది ఆగస్టులోనే మూవీ షూటింగ్ పూర్తియింది. అప్పటి నుంచీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అఖండ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఫస్ట్ సింగ్ తాండవంతో మూవీ టీమ్ మెల్లగా ప్రమోషన్లపై దృష్టి సారించనుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని అభిమానులు అంచనాతో ఉన్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More