ఇప్పుడు చిరంజీవి, తర్వాత బాలకృష్ణ.. నాలుగోసారి బాలయ్యతో జత కట్టనున్న నయనతార.. డైరెక్టర్ అతడే..
నయనతార తెలుగులో వరుసగా పెద్ద సినిమాల ఆఫర్లను సంపాదించేస్తోంది. ప్రస్తుతం చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారు మూవీ చేస్తున్న ఆమె.. ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి నాలుగోసారి జత కట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నయనతార సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలకుపైనే అయింది. అటు తమిళంతోపాటు తెలుగులోనూ ఎన్నో హిట్స్ అందుకొని లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారులో నటిస్తున్న ఆమె.. ఆ వెంటనే మరో తెలుగు మూవీ చేయబోతోంది. అది కూడా బాలకృష్ణతో కావడం విశేషం.

నాలుగోసారి బాలయ్యతో..
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న ఓ పీరియడ్ యాక్షన్ మూవీలో నయనతార నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే బాలయ్యతో ఆమె జత కట్టడం ఇది నాలుగోసారి అవుతుంది. ఇప్పటికే అతనితో కలిసి సింహా, శ్రీరామ రాజ్యం, జై సింహా సినిమాలను ఆమె చేసింది.
ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టాయి. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తుందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. 2023లో బాలయ్యతో వీర సింహారెడ్డి మూవీ తీసి హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని.. ఇప్పుడు రెండోసారి చేతులు కలపబోతున్నాడు. అటు నయనతారకు ఈ డైరెక్టర్ తో ఇదే తొలి సినిమా కానుంది.
ఇప్పటికే గోపీచంద్.. చిరంజీవి మూవీ సెట్ లో నయనతారను కలిసి కథ వినిపించినట్లు సమాచారం. ఈ స్టోరీ, తన పాత్ర బాగా నచ్చడంతో నయన్ వెంటనే మూవీకి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రెమ్యునరేషన్ పై చర్చలు జరుగుతున్నాయి. అటు గోపీచంద్ చివరిగా సన్నీ డియోల్ తో కలిసి జాట్ మూవీ చేసిన విషయం తెలిసిందే. అతనికి ఇదే తొలి హిందీ మూవీ.
నయనతార జోరు
నయనతార 2006లో లక్ష్మీ మూవీతో నేరుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అప్పటికే ఆమె చంద్రముఖి, గజినీలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చివరికి 2022లో చిరంజీవితోనే తెలుగులో గాడ్ ఫాదర్ మూవీ చేసిన ఆమె.. మూడేళ్ల తర్వాత మళ్లీ చిరుతోనే మన శంకర వరప్రసాద్ గారు చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇదే కాకుండా తమిళంలో 4, కన్నడ, మలయాళంలలో ఒక్కో మూవీ చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా నయనతార డిమాండ్ ఏమాత్రం తగ్గకపోగా.. ఈ మధ్యకాలంలో మరింత పెరిగింది. ఇప్పుడు బాలకృష్ణతో మరో సినిమా నిజంగా ఆసక్తి రేపుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


