Wedding Card Vastu: పెళ్ళి కార్డులు ఏ రంగులో ఉంటే మంచిది? ఎలాంటి వాస్తు నియమాలను పాటించాలో తెలుసుకోండి!

వాస్తు ప్రకారం పాటించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి. వాస్తు దోషాలు కూడా తొలగి ఆనందంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. మరి పెళ్లి కార్డుకు సంబంధించి ఎలాంటి నియమాలను పాటించాలి? పెళ్లి కార్డు ఏ రంగులో ఉంటే మంచిదో తెలుసుకుందాం.

Published on: Nov 15, 2025, 10:00:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి. వాస్తు దోషాలు కూడా తొలగి ఆనందంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది, ప్రత్యేక క్షణం. పెళ్లికి సంబంధించి కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. ముఖ్యంగా పెళ్లి కార్డు విషయంలో కొన్ని నియమాలను తప్పక పాటించడం మంచిది. అలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

పెళ్లి కార్డు విషయంలో పాటించాల్సిన వాస్తు నియమాలు (gemini )
పెళ్లి కార్డు విషయంలో పాటించాల్సిన వాస్తు నియమాలు (gemini )

ప్రతి ఒక్కరు వివాహానికి సంబంధించిన ప్రతిదీ పరిపూర్ణంగా, మనసుకు అనుగుణంగా ఉండాలని అనుకుంటారు. పెళ్లి వేదిక, అతిథులు, అలంకరణ, దుస్తులు, బహుమతులు, పెళ్లి కార్డులు. వీటన్నిటి కోసం చాలా నెలల ముందే పనులు మొదలుపెడతారు. అయితే ఈ సమయంలో చాలామంది పెళ్లి కార్డుకు సంబంధించిన నియమాలను కూడా పాటిస్తూ ఉంటారు. మరి పెళ్లి కార్డుకు సంబంధించి ఎలాంటి నియమాలను పాటించాలి? పెళ్లి కార్డు ఏ రంగులో ఉంటే మంచిది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లి కార్డు విషయంలో పాటించాల్సిన వాస్తు నియమాలు

1.వినాయకుడు ముందు పెట్టాలి:

పెళ్లి కార్డును మొట్టమొదట వినాయకుడిని పూజించే స్థలంలో, వినాయకుడు ముందు పెట్టాలి. ఏదైనా శుభకార్యానికి ముందు కచ్చితంగా వినాయకుడిని పూజించాలి. విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఆరాధించి ఏదైనా పనిని మొదలుపెడితే అడ్డంకులు, విఘ్నాలు లేకుండా ఆ పనులు విజయవంతంగా పూర్తవుతాయని నమ్ముతారు.

కాబట్టి మొట్టమొదట పెళ్లి కార్డును వినాయకుడు ముందు పెట్టి, ఆ తర్వాత ఇతరులకు ఇవ్వాలి. వినాయకుడిని ఎప్పుడైనా ఆరాధించి ఆయన ముందు పెళ్లి కార్డు పెట్టొచ్చు. ముఖ్యంగా గురువారం నాడు ఇలా చేయడం చాలా శుభప్రదం. గురువారం గురు గ్రహానికి సంబంధించినది. వివాహం, కెరియర్ కి గురువు కారకుడు.

2.వాస్తు ప్రకారం ఏ రంగు కార్డు శుభప్రదం?

వాస్తు ప్రకారం పెళ్లి కార్డును ప్రింట్ చేసేటప్పుడు కొన్ని రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రంగుల పెళ్లి కార్డులను ప్రింట్ చేయించడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుంది. పెళ్లి కార్డులు ఎరుపు, మెరూన్, గులాబీ, పసుపు, బంగారం లేదా క్రీమ్ కలర్ లో ఉంటే అత్యంత శుభప్రదం. ఇవి అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు.

3.కార్డును ఈ దిశలో పెట్టడం మంచిది

పెళ్లి కార్డులు ప్రింట్ చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈశాన్యం మూలలో పెడితే చాలా మంచి జరుగుతుంది. ఇంటి దిక్కుల్లో అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ దిశలో పెళ్లి కార్డులను పెట్టి ఉంచితే చక్కటి ఫలితాలు వస్తాయని చూస్తారు. ఈ దిశలో దేవుళ్లు, దేవతలు ఉంటారని అంటారు. చాలా మంది పెళ్లి కార్డులపై ఏదైనా సామాన్లను పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. అలా చేయడం వలన సానుకూల శక్తి దెబ్బతింటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More